Rashmika Mandanna : తన అభిమానికి ఎన్నడూ మర్చిపోలేని స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక మందన్నా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : తన అభిమానికి ఎన్నడూ మర్చిపోలేని స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక మందన్నా..

 Authored By mallesh | The Telugu News | Updated on :29 September 2022,3:30 pm

Rashmika Mandanna : రష్మిక మందన్నా ప్రస్తుతం టాలీవుడ్ బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్తోంది. మొన్నటివరకు ఒక్క తెలుగు పరిశ్రమకే పరిమితం అయిన ఈ బ్యూటీ హవా..ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలకు పాకింది. తమిళం, మళయాళం, బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ సత్తా చాటుతోంది.రష్మిక ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా అవతరించడంతో ఈ అమ్మడుకి సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.

Rashmika Mandanna : అభిమాని గుండెల పైన చెరగని ముద్ర

రష్మిక మందన్నా ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లిస్టులో తన పేరును లిఖించుకోవడానికి చాలా ఆత్రుతగా ఉన్నట్టు తెలుస్తోంది.అందుకోసమే వరుసబెట్టిసినిమాలు చేస్తోంది.అన్ని భాషల్లోనూ తన మార్క్ చూపిస్తోంది.రీసెంట్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న రష్మిక.. శ్రీవల్లి పాత్రలో లీనమై నటించింది. ప్రస్తుతం ఈ భామ ముంబైలో కనిపిస్తే అందరూ శ్రీవల్లి అని పిలుస్తున్నారట.. అంతగా పుష్ప సినిమా అక్కడి వారికి కనెక్ట్ అయ్యింది. త్వరలోనే దీని సీక్వెల్ రానుంది. దీని కోసం రష్మిక రెమ్యూనరేషన్ భారీగానే డిమాండ్ చేస్తుందట..తొలిభాగంలో రష్మిక అందాలకు యూత్ ఫిదా అయిపోయింది.

Rashmika Mandanna gave sweet gift to her fan

Rashmika Mandanna gave sweet gift to her fan

అందుకే నిర్మాతలు కూడా రష్మికకు భారీ మొత్తంలో ముట్టజెప్పేందుకు ఓకే అన్నారట.. ఇక రష్మికకు ఫ్యాన్ ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతోంది. ఈ మధ్యే సమంతను కూడా రష్మిక బీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రష్మిక నటించిన గుడ్ బై చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రమోషన్స్‌లో పాల్గొంది రష్మిక..ఈ క్రమంలోనే తన అభిమానికి లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే గిఫ్ట్ ఇచ్చింది.ముందుగా అతని బుక్ లో సైన్ చేసిన రష్మిక.. ఆతర్వాత అతని ఛాతి దగ్గర చెరగని ముద్ర వేసింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫ్యాన్స్ కూడా రష్మిక తెగ మోసేస్తున్నారు.

YouTube video

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది