
Rashmika Mandanna Vs Pooja Hegde remuneration for there new films
Rashmika Mandanna: పూజా హెగ్డే కంటే రష్మికకే బాలీవుడ్‌లో క్రేజ్ ..అందుకు కారణం ఇదే..! అంటూ ఈ మధ్యకాలంలో వీరి గురించి సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలోనూ ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన చాలా ఏళ్ళకు గానీ స్టార్ డమ్ దక్కలేదు. బాలీవుడ్‌లో అయితే, ఇంకా ఆమె నటించిన ఒక్కటీ రిలీజ్ కాలేదు. గతంలో చేసిన సినిమా కూడా భారీ డిజాస్టర్‌గా మిగిలింది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేసిన మహర్షి సినిమా పూజా హెగ్డే అందుకున్న ఫస్ట్ కమర్షియల్ హిట్.ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో లాంటి సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది.
యంగ్ హీరో అఖిల్ సరసన నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా కూడా పూజా గ్లామర్ వల్లే హిట్ అయిందనే టాక్ వినిపించింది. ఇక ఇటీవల వచ్చిన రాధే శ్యామ్ సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మారుతుందనుకుంటే ఆ సినిమా ఫ్లాపయి రష్మికకు షాకిచ్చింది. కానీ, పూజా హెగ్డేతో పోల్చుకుంటే రష్మిక అన్ని విధాల మేకర్స్‌కు లక్ అండ్ సూపర్ సపోర్టింగ్ హీరోయిన్ అని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో కూడా పూజా కంటే రష్మిక డిమాండ్ చేసినా కాస్త చూసి చూడనట్టుగా సైన్ చేసేస్తుందట.మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న రష్మిక ఆ తర్వాత కూడా గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి సినిమాలతో క్రేజీ హిట్స్ అందుకుంది. ఇక పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియన్ రేంజ్ హీరోయిన్‌గా భారీ క్రేజ్ తెచ్చుకుంది.
rashmika mandanna has more craze than pooja hegde
దాంతో అమ్మడికి బాలీవుడ్‌లో దాదాపు అరడజను సినిమాలలో నటించే అవకాశం అందుకుంది. ఇప్పటికే రెండు సినిమాలను పూర్తి చేసింది. మరో రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటుండగా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా – రణ్‌బీర్ కపూర్ కాంబోలో తెరకెక్కుతున్న యానిమల్ సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో రష్మిక మొదటిసారి భారీ స్థాయిలో రొమాంటిక్ సీన్స్ చేయడానికి సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలాంటి విషయాలలో పూజా కొన్ని కండీషన్స్ పెడుతుందట. కానీం, రష్మికకు ఎక్కువ సినిమాలు చేయాలనే టార్గెట్ పెట్టుకొనే కాస్త మేకర్స్‌కు అనుగుణంగా ప్రవర్తిస్తూ చేతిలోకి కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటుందట. ఇలా పూజాకు రష్మిక గట్టిగానే పోటీ ఇస్తోంది.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.