Rashmika Mandanna ; నేషనల్ క్రష్ రష్మిక మందనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ ఛలో ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ పుష్ప ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిల స్టార్ హీరోయిన్ అయిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషలలో సినిమాలు చేస్తుంది. అలాగే ఇటీవల బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా తనదైన స్టైల్ లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. అయితే రీసెంట్గా రష్మిక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘ బేబీ ‘ సినిమాను థియేటర్లో చూశారు.
జూలై 14న విడుదలైన ‘ బేబీ ‘ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్య నటించింది. అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ ను నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు పలువురు స్టార్ సెలబ్రిటీస్ కంగ్రాట్యులేషన్స్ విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే రష్మిక మందన, రాశి కన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ బేబీ సినిమా చూసి ఆనంద్ దేవరకొండకు విషెస్ అందించారు.
అయితే బేబీ సినిమా చూడడానికి స్టార్ హీరోయిన్ రష్మిక చాలా సీక్రెట్ గా థియేటర్ కి వచ్చిన క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లూ జీన్స్, వైట్ టీ షర్ట్, బ్లాక్ క్యాప్, ఫేస్ కి మాస్క్ పెట్టుకొని మరీ బేబీ సినిమా చూడడానికి సీక్రెట్ గా వచ్చింది రష్మిక అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. దానికి కారణం తన అన్న విజయ్ దేవరకొండ అంటూ చెప్పుకు వస్తున్నారు. ప్రీమియర్ షో నడుస్తున్న స్క్రీన్ వన్ లోకి సీక్రెట్ గా బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ ఇచ్చిన రష్మిక కి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు ఆనంద్ దేవరకొండ సినిమా నుంచి ఓ పాటను రిలీజ్ చేసింది రష్మిక. దీంతో తన మరిది కోసం రష్మిక ఇలా చేస్తుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
This website uses cookies.