Rashmika Mandanna : విజయ్ దేవరకొండ తమ్ముడికి హెల్ప్ చేసిన రష్మిక మందన..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : విజయ్ దేవరకొండ తమ్ముడికి హెల్ప్ చేసిన రష్మిక మందన..!!

Rashmika Mandanna ; నేషనల్ క్రష్ రష్మిక మందనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ ఛలో ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ పుష్ప ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిల స్టార్ హీరోయిన్ అయిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషలలో సినిమాలు చేస్తుంది. అలాగే ఇటీవల బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా తనదైన స్టైల్ లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకునే […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 July 2023,5:00 pm

Rashmika Mandanna ; నేషనల్ క్రష్ రష్మిక మందనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ ఛలో ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ పుష్ప ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిల స్టార్ హీరోయిన్ అయిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషలలో సినిమాలు చేస్తుంది. అలాగే ఇటీవల బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా తనదైన స్టైల్ లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. అయితే రీసెంట్గా రష్మిక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘ బేబీ ‘ సినిమాను థియేటర్లో చూశారు.

జూలై 14న విడుదలైన ‘ బేబీ ‘ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్య నటించింది. అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ ను నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు పలువురు స్టార్ సెలబ్రిటీస్ కంగ్రాట్యులేషన్స్ విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే రష్మిక మందన, రాశి కన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ బేబీ సినిమా చూసి ఆనంద్ దేవరకొండకు విషెస్ అందించారు.

Rashmika And Anand Devarakonda Cute Visuals @ Baby Song Launch | MS Talkies  - YouTube

అయితే బేబీ సినిమా చూడడానికి స్టార్ హీరోయిన్ రష్మిక చాలా సీక్రెట్ గా థియేటర్ కి వచ్చిన క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లూ జీన్స్, వైట్ టీ షర్ట్, బ్లాక్ క్యాప్, ఫేస్ కి మాస్క్ పెట్టుకొని మరీ బేబీ సినిమా చూడడానికి సీక్రెట్ గా వచ్చింది రష్మిక అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. దానికి కారణం తన అన్న విజయ్ దేవరకొండ అంటూ చెప్పుకు వస్తున్నారు. ప్రీమియర్ షో నడుస్తున్న స్క్రీన్ వన్ లోకి సీక్రెట్ గా బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ ఇచ్చిన రష్మిక కి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు ఆనంద్ దేవరకొండ సినిమా నుంచి ఓ పాటను రిలీజ్ చేసింది రష్మిక. దీంతో తన మరిది కోసం రష్మిక ఇలా చేస్తుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది