
Rashmika Mandanna : రష్మిక సెన్సేషనల్ పోస్ట్ .. ఎవరిని ఉద్దేశించి పెట్టినట్లు..!!
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ‘ఛలో ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుస సినిమా చేస్తూ కుర్ర కారు హృదయాలను దోచుకుంటున్నారు. ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్ పుష్ప 2 లో నటిస్తోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ రన్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై భారీ కలక్షన్స్ రాబడుతుంది. ఇక రష్మిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. వివిధ రకాల ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటాయి.
తాజాగా రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘ నేను నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నా.. నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్ ‘ అని ఆమె ఓ కొటేషన్ ను పోస్ట్ చేశారు. దీంతో ఎవరు ఆ వ్యక్తి అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెవరు ఉంటారు విజయ్ దేవరకొండ కోసమే రష్మిక ఇలా పోస్ట్ చేసి ఉంటారని కొందరు కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని కామెంట్స్ చేశారు. మరి ఆమె ఎవరిని ఉద్దేశించి ఇలా పోస్ట్ చేశారో క్లారిటీ లేదు. ఆమె జీవితంలోకి ముఖ్యమైన వాళ్ళు ఎవరో వచ్చి ఉంటారు. అందుకే ఆమె ఇలా పోస్ట్ చేసి ఉంటారని తెలుస్తుంది. తను ప్రేమించిన వ్యక్తిని ఉద్దేశిస్తూ రష్మిక ఇలా పోస్ట్ చేసి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే ప్రస్తుతం రష్మిక ‘ పుష్ప 2 ‘ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2024 లో ఆగస్టు 15న విడుదల కానుంది. ఇంకా విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేయనున్నారు. అలాగే కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల , సూపర్ స్టార్ ధనుష్ సినిమాలో కూడా రష్మిక నటిస్తున్నట్లు తెలుస్తుంది. రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాలో కూడా చేస్తున్నారు. ఇంకా లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ రెయిన్ బో ‘ లో కూడా రష్మిక నటించనున్నారు. ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే చియాన్ విక్రమ్ సినిమాలో కూడా రష్మిక ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. కన్నడ బ్యూటీ అయిన రష్మిక పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు.
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
Chiranjeevi Davos : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
This website uses cookies.