Rashmika Mandanna : బెడ్ మీద నుంచే ముద్దులు.. పొద్దుపొద్దున్నే అలా : రష్మిక మందన్నా
Rashmika Mandanna రష్మిక మందన్నా ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. నేషనల్ క్రష్ అంటే జాతీయస్థాయిలో రష్మిక దుమ్ములేపుతోంది. ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లు కూడా అలాంటివే. ఏకంగా బాలీవుడ్‌లో వరుసగా రెండు మూడు ప్రాజెక్ట్‌లు రెడీగా ఉన్నాయి. ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే హిందీలో వరుసగా ప్రాజెక్ట్‌లు వచ్చేశాయి. అయితే ఆమెకు హిందీ భాషలోనూ ప్రావీణ్యం ఉన్నట్టుంది. హిందీ సినిమాల కోసం ప్రత్యేకంగా హిందీ కూడా నేర్చుకున్నట్టు కనిపిస్తోంది.

Rashmika Mandanna Latest Daily Routine Works
ఆ మధ్య ఓ నెటిజన్ మలయాళంలో మాట్లాడరా? అని అడిగేశాడు. ఇంత వరకు మలయాళంలో నటించే అవకాశం రాలేదు.. ఒక వేళ వస్తే.. నేర్చుకుని మాట్లాడతాను అని చెప్పేసింది. అంటే తాను నటించి భాషను కచ్చితంగా రష్మిక నేర్చుకుంటుందన్న మాట. అయితే రష్మిక ఈ మధ్య డైరీ లాంటిది సోషల్ మీడియాలో రాసుకుంటూ వస్తోంది. ఆ రోజంతా ఏ ఏ పనులు చేసింది..ఎలా గడిచింది.. ఎవరిని కలిసింది.. రోజు ఎలా ముగిసింది అనే వాటిని చెబుతుంటుంది.
Rashmika Mandanna ఆరా ముద్దులతో రష్మిక నిద్రలేచిందట..

Rashmika Mandanna Latest Daily Routine Works
అలా రష్మిక అక్టోబర్ 18న ఏ ఏ పనులు చేసింది.. ఎలా గడిచిందో చెప్పుకొచ్చింది. తన పెట్ ఆరా వచ్చి నిద్రలేపింది.. నిద్రలేచే సరికి దాని మొహం నా మూతిపై పెట్టింది. నిద్రలేపేందుకు నాకు ముద్దులుపెడుతూనే ఉంది.. అలా నిద్రలేచాను.. టైం దగ్గరపడటంతో వెంటనే సెట్కు వెళ్లాను. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగింది. ఎప్పటిలానే షూటింగ్ బాగా జరిగింది. త్వరగానే పాకప్ చెప్పేశారు. వస్తూ దారిలో అమ్మతో మాట్లాడాను.. చాల రోజుల తరువాత ఓ ఫ్రెండ్‌తో మాట్లాడాను.. ఇంటికి వచ్చాక జిమ్ చేశాను. తర్వగా నిద్రపోయాను అంటూ చెప్పుకొచ్చింది.