Rashmika mandanna : రష్మిక మందన్న లేటెస్ట్ మ్యూజిక్ వీడియో ‘టాప్ టక్కర్’ టీజర్ లో రచ్చ చేసింది ..!

Authored By vamana sai | The Telugu News | Updated on : 10 February 2021, 9:00 am

Rashmika mandanna : రష్మిక మందన్న .. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ ని ఏలుతోంది. ఛలో అన్న చిన్న సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై రష్మిక మందన వరసగా స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ అందుకుంది. కెరీర్ లో ఇంత త్వరగా సూపర్ స్టార్ మహేష్ బాబు కి జంటగా నటించే ఛాన్స్ అందుకుంటుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. గత ఏడాది మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు .. నితిన్ తో భీష్మ సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంది. దాంతో రష్మిక క్రేజ్ టాలీవుడ్ లో విపరీతంగా పెరిగిపోయింది. చెప్పాలంటే టాలీవుడ్ లో ఇప్పుడు రష్మిక మందన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

rashmika-mandanna-latest-music-video-top-tucker-is-an-amazing-one

rashmika-mandanna-latest-music-video-top-tucker-is-an-amazing-one

ఈ క్రేజ్ వల్ల ఇప్పుడు రష్మిక మందన్న బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే యంగ్ హీరో సిద్దార్థ్ మల్‌హోత్రా కి జంటగా మిషన్ మజ్ఞు అన్న సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కి కూతురుగా ఒక సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే బాలీవుడ్ లో కూడా రష్మిక మందన స్టార్ హీరోయిన్ గా సెటిలైనట్టే. అంతేకాదు అక్కడ కియారా అద్వానీ.. పూజా హెగ్డేలకి గట్టి పోటీ ఇస్తుందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా అమితాబ్ తో చేసే సినిమా బాలీవుడ్ లో రష్మిక కి బాగా ప్లస్ అవుతుందని చెప్పుకుంటున్నారు.

Rashmika mandanna : ఇలాంటి మ్యూజిక్ ఆల్బం లో చేస్తే వచ్చే క్రేజ్ కూడా సినిమా రేంజ్ లో ఉంటుంది.

కాగా రష్మిక కి కోలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. అక్కడ సినిమాలు కమిటవుతోంది. అంతేకాదు మధ్యలో క్రేజీ వీడియో ఆల్బంస్ లో చేయడానికి సై అంటోంది. కొత్తగా టాప్ టక్కర్ అన్న వీడియో ఆల్బం చేసింది రష్మిక. ఫుల్ ఫంకీ గా ఉన్న ఈ ఆల్బం తో రష్మిక క్రేజ్ మరోలా కూడా పెరుగుతుందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు పాపులర్ సింగర్ అద్నాన్ సమీ.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియా లాంటి వాళ్ళ నుంచి ఖచ్చితంగా వీడియో సాంగ్స్ చేసే ఛాన్స్ దక్కించుకుంటుందని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి రీసెంట్ గా రిలీజైన టాప్ టక్కర్ టీజర్ లో రష్మిక రచ్చ మామూలుగా లేదు. ఇలాంటి మ్యూజిక్ ఆల్బం లో చేస్తే వచ్చే క్రేజ్ కూడా సినిమా రేంజ్ లో ఉంటుంది. అందుకే రష్మిక ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోలేదట.

vamana sai

No bio available for this author.

  1. "Rice price : ప్రజలకు గుడ్ న్యూస్.. ఆధార్ ఉంటే చాలు..తక్కువ ధరకే బియ్యం.. ఎక్కడ దొరుకుతుంది? ఎలా కొనాలి? వివరాలివే.."

  2. "Karthika Deepam 2 Today Episode August 04 : సూరజ్‌పై జ్యోత్స్న ఆగ్రహం.. పెళ్లి ఆపేందుకు కుటుంబంలో కొత్త డ్రామా!"

  3. "Gold Rate Today : బంగారం కొనేవారికి శుభవార్త.. ఆగస్టు 4న 22, 24 క్యారెట్ల తాజా రేట్లు ఇవే!"

  4. "Viagra Benefits : క్యాన్సర్‌పై వయాగ్రా ప్రభావం? ..ఇజ్రాయెల్ పరిశోధనలో ఆసక్తికర విషయాలు.. ?"

  5. "Fruit Sticker: పండ్లపై ఉన్న స్టిక్కర్ అర్థం తెలుసా? .. 4, 8, 9 ఈ కోడ్ తెలియకపోతే మోసపోయే అవకాశం!"

  6. "Astrology : శని అనుగ్రహంతో ఈ 2 రాశుల వారికి భారీ అదృష్టం.. వచ్చే 3 ఏళ్లు శుభయోగమేనా?"

  7. "Rajamouli : మహేష్ వారణాసి సినిమా కథ ఇదేనా ?.. రాజమౌళి మాటలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp