rashmika mandanna
Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కిర్రాక్ పార్టీ సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో తెలుగులో యంగ్ హీరో నాగ శౌర్య సరన ఛలో సినిమాలో నటించే అవకాశం అందుకొని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు డెబ్యూ మూవీ కూడా సూపర్ హిట్ అవడంతో తెలుగులో వరుసగా నాని, నితిన్, శర్వానంద్, లాంటి యంగ్ హీరోలతో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియన్ స్టార్స్ హీరోలతో నటించే అవకాశాలను అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది.
rashmika mandanna Latest Red Dress Pic goes to viral
ఇదే క్రమంలో అమ్మడి క్రేజ్ చూసి బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో గుడ్ బై, సిద్దార్థ్ మల్‌హోత్రాతో మిషన్ మజ్ఞు సినిమాలతో పాటు మరో సినిమాకి సైన్ చేసింది. కోలీవుడ్‌లో కూడా సుల్తాన్ సినిమాతో కార్తి సరసన నటించి తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇలా సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న రష్మిక సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటి కప్పుడు తన లేటెస్ట్ ఫొటో షూట్స్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజెస్ ఇస్తోంది.
కాగా రీసెంట్‌గా జరిగిన ప్రతిష్ఠాత్మక సైమా అవార్డ్ ఫంక్షన్‌లో రష్మిక మందన్న స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీస్ కలిసి జరిపే ఈ సైమా వేడుకలకి నాలుగు సినిమా ఇండస్ట్రీస్‌కి సంబంధించిన సినీ తారలందరూ హాజరయ్యారు. ఇందులో రష్మిక ధరించిన రెడ్ కలర్ ట్రెండీ వేర్ హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ రెడ్ డ్రెస్‌లో రష్మిక కాస్త ఘాటు అందాలను ఆరబోస్తూ కెమెరాలకి ఫోజులిచ్చింది. అసలే స్టార్ హీరోయిన్. తళ తళ మెరిసే డ్రెస్‌లో అందంగా కనిపిస్తే చూడటానికి రెండు కళ్ళు చాలవు. రష్మిక సైమా అవార్డ్ ఫంక్షన్ లో ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
This website uses cookies.