Rashmika Mandanna : పెళ్లి చేసుకోబోయే వాడిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పిన రష్మిక మందన్న

Authored By Sam C | The Telugu News | Published on: February 16, 2022, 7:00 pm
Rashmika Mandanna : ఒక‌ప్పుడు రష్మిక మందన్న టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కెరీర్ కొన‌సాగిస్తుందా లేదా అనే అనుమానం అంద‌రిలో ఉండేది. కాని ఈ ముద్దుగుమ్మ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. పుష్పతో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ క్రియేట్ చేసింది. అసలే నేషనల్ క్రష్ అయిన రష్మిక.. ఇప్పుడు పుష్ప సినిమాతో అందరికీ ఫేవరేట్ హీరోయిన్‌గా మారింది. బాలీవుడ్ సినిమాలు ఇంకా రిలీజ్ కాకముందే అక్కడ రష్మికకు మంచి పాపులారిటీ వచ్చేసింది. ‘ఛలో’ అంటూ తెలుగులో తన సినిమా ప్రయాణాన్ని ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ ‘గీతగోవిందం’, ‘దేవదాస్’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ చిత్రాలతో వరుస హిట్లు సొంతం చేసుకుంది.
బాలీవుడ్‌, కోలీవుడ్‌ల‌లో కూడా వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తుందిఈ అమ్మ‌డు సినిమాల‌తోనే కాదు ప్రేమ వ్య‌వ‌హారంతోను వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. గతంలో రష్మిక, అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే, ఇద్దరూ అలాంటి వార్తలను ఖండించారు. ఇప్పుడు, తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక ప్రేమ మరియు సంబంధాల గురించి మరియు తను ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అనే విషయాల మీద కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘నా వరకు ప్రేమ అనేది ఒకరి కొకరు గౌరవం సమయం ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది, అలాగే ఎవరితో అయితే మనం సెక్యూర్ గా ఫీల్ అవుతామో వారిని మాత్రమే ప్రేమించాలి.
rashmika mandanna opens up about love and relationship

rashmika mandanna opens up about love and relationship

Rashmika Mandanna : పెళ్లి గ‌డియ‌లు ద‌గ్గ‌ర ప‌డ్డాయా..!

ప్రేమను వర్ణించడం కష్టం ఎందుకంటే ప్రేమ అంటేనే ఫీలింగ్స్ అని రష్మిక చెప్పుకొచ్చింది. ప్రేమ ఇరువైపులా ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది ఒకరి వైపు నుంచి ప్రేమ ఉండి మరొకరి వైపు నుంచి లేకపోతే అది బాగోదు అని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లి గురించి అయితే ఇప్పుడేమి మాట్లాడను. ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన కూడా చేయడం లేదు ఎందుకంటే పెళ్లి చేసుకునే అంత వయసు నాకు రాలేదు అని నేను అనుకుంటున్నాను. పెళ్లి గురించి మాట్లాడాలంటే ఎవరితో అయితే నేను కంఫర్టబుల్ అని ఫీల్ అవుతామో వాళ్లను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాను, ఎవరైనా అలాంటి వారిని చేసుకుంటేనే హ్యాపీగా ఉండగలరు అని ఆమె చెప్పుకొచ్చారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp