Balakrishna : జగన్‌ని కలిసే అవసరం నాకు లేదు.. నేను రానని చెప్పా అంటూ బాలకృష్ణ సంచలన కామెంట్స్
Balakrishna : సినిమా ఇండస్ట్రీ వర్సెస్ ఏపీ ప్రభుత్వం.. ఇది కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. జగన్ ప్రభుత్వం టికెట్ రేట్స్ తగ్గించడంతో పాటు పలు సమస్యలకు గురి చేస్తుండగా,ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు చిరంజీవి ముందడగు వేశారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభాస్, మహేష్ అలాగే రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి మరికొందరు సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. అనంతరం జగన్మోహన్ రెడ్డిని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయన చేసిన కొన్ని కామెంట్స్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మొన్న జరిగిన చర్చల్లో మిస్ కమ్యూనికేషన్ జరిగిందని అంటూ నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చినప్పటికి కూడా ఆయనకు అందజేయలేదని అన్నారు. ఇక నాన్న గారికి ఇన్విటేషన్ అందకపోవడం పై కూడా ఫిల్మ్ ఛాంబర్ లో చర్చిస్తాం అంటూ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ నాన్న గారు అని అన్నారు. ఇక అలా ఎవరు ఇలా చేశారో మాకు తెలుసని అంటూ ఎలా కరెక్ట్ చేయాలో మేము ఆలోచిస్తామని విష్ణు అన్నారు. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో బాలయ్యకు ఇన్విటేషన్ అందిందా లేదా అనే దానిపై కూడా చర్చకు వచ్చింది. తాజగా దానిపై ఆయన స్పందించారు.
Balakrishna : బాలయ్య తగ్గేదేలే…
జగన్‌తో భేటికి ఆహ్వానం అందిందా అనే ప్రశ్నపై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. సీఎం జగన్‌తో సమావేశానికి సినీ ప్రముఖులు తనను కూడా ఆహ్వానించారని వెల్లడించారు. అయితే, ఆ సమావేశానికి తాను రానని చెప్పానని బాలయ్య తెగేసి చెప్పారు. ఈ విషయంలో తనకు స్పష్టమైన విధానం ఉందని చెప్పుకొచ్చారు. తాను సినిమాల విషయంలో రెమ్యూనరేషన్ పెంచనని, తన సినిమా బడ్జెట్‌ను కూడా పెంచబోనని వివరించారు. ఇలా చేసి నిర్మాతను ఇబ్బంది పెట్టే ఆలోచన తనకు ఉండదని వెల్లడించారు. సినిమా టికెట్ల ధరలపై గతంలోనే తాను కొన్ని సూచనలు చేశానని బాలకృష్ణ వెల్లడించారు. అఖండ సినిమానే ఇందుకు ఉదాహరణ అంటూ కూడా బాలయ్య పేర్కొన్నారు.