Rashmika Mandanna : పుష్ప సీక్వెల్ నుండి రష్మికా మందన్నని తీసేసి వేరే హీరోయిన్‌ని తెచ్చారా.. ఏమైంది పాపం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : పుష్ప సీక్వెల్ నుండి రష్మికా మందన్నని తీసేసి వేరే హీరోయిన్‌ని తెచ్చారా.. ఏమైంది పాపం..!

Rashmika Mandanna : ఇటీవ‌ల చాలా చిత్రాలు రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న విష‌యం తెలిసిందే. బాహుబ‌లి నుండి ఈ పంథా మొద‌లైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ ఎంతటి సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇక బన్నీ కూడా ఊరమాస్ అవతారంలో తన పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను […]

 Authored By sandeep | The Telugu News | Updated on :13 May 2022,6:30 pm

Rashmika Mandanna : ఇటీవ‌ల చాలా చిత్రాలు రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న విష‌యం తెలిసిందే. బాహుబ‌లి నుండి ఈ పంథా మొద‌లైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ ఎంతటి సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇక బన్నీ కూడా ఊరమాస్ అవతారంలో తన పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. అయితే పుష్ప 2 కూడా వస్తుందని అందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప-ది రూల్’ను చిత్ర యూనిట్ తెరకెక్కించేందుకు రెడీ అయ్యింది. అయితే మరోసారి పుష్ప-2 సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.పుష్ప 2 కోసం సుకుమార్ స‌రికొత్త ప్లాన్స్ వేస్తున్నాడు. ఈ సారి సినిమా మ‌రో రేంజ్‌లో ఉండాల‌ని బాలీవుడ్ స్టార్స్‌ని కూడా ప‌ట్టుకొస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ ను కూడా పుష్ప సెకండ్ పార్ట్ లో ముఖ్యమైన పాత్రలో చూపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫస్ట్ పార్ట్ లో నటించిన హీరోయిన్ రష్మిక మందన నటనకు మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే.

Rashmika Mandanna out from pushpa 2

Rashmika Mandanna out from pushpa 2

Rashmika Mandanna : స‌రికొత్త ప్లాన్స్..

అయితే ర‌ష్మిక‌ని త‌ప్పించి వేరే హీరోయిన్‌ని పెట్టుకోనున్నార‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా, అది అసాధ్యం. అందుకు కార‌ణం ర‌ష్మిక‌తో చాలా స‌న్నివేశాలు చిత్రీక‌రించాడు సుకుమార్.పవర్ఫుల్ పాత్ర కోసం మాత్ర‌మే దర్శకుడు సుకుమార్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోయిన్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్రను చివర్లో వచ్చే ఒక ట్విస్ట్ తో పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారట. తప్పకుండా సినిమాలో ఆ క్యారెక్టర్ హైలెట్ అయ్యే విధంగా ఉంటుందట. అంతేకాకుండా మరికొంతమంది ప్రముఖ బాలీవుడ్ తారలను కూడా ఈ సినిమాలో భాగం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది