Rashmika Mandanna : మహేష్ బాబు మూవీ కోసం ర‌ష్మిక దిమ్మ తిరిగే రెమ్యున‌రేష‌న్.. ఐటెం సాంగ్‌కే ఇంత డిమాండ్ చేస్తే ఎలా?

Authored By Sam C | The Telugu News | Published on: December 2, 2022, 5:00 pm

Rashmika Mandanna : నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మిక మందన్న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నఈ భామ ఆ తర్వాత విజయ్‌తో గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి సినిమాలు చేసింది. తన నటనతో పాటు అందచందాలతో తెలుగు వారిని గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తూనే వ‌స్తుంది. అయితే వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని ఈ శాండిల్ వుడ్ బ్యూటీ అందిపుచ్చుకుంటూ దూసుకెళుతుండ‌గా, తాజాగా ర‌ష్మిక మంద‌న్న‌కి సంబంధించిన ఓ అంశం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం హీరోయిన్‌గా చేస్తూనే ఓ ఐటెం సాంగ్‌లో న‌టించ‌డానికి రెడీ అయిన‌ట్టు తెలుస్తుంది.

సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో SSMB 28 చేస్లుండ‌గా, ఈ సినిమాలో గ్లామ‌ర్ డోస్‌ను త్రివిక్ర‌మ్ బాగానే పెంచాడు. ఎందుకంటే ఇప్పటికే ఇద్ద‌రు హీరోయిన్స్ అయిన‌ పూజా హెగ్డే ,శ్రీలీల న‌టిస్తున్నారు. వీరిద్ద‌రితో పాటు ఇప్పుడు ర‌ష్మిక మంద‌న్న ఐటెమ్ సాంగ్ చేస్తుంద‌నే వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ముగ్గురు భామ‌లు ఒక సినిమాలో న‌టిస్తున్నారు అనే స‌రికి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ర‌ష్మిక‌.. ఇంతకు ముందు మహేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అయితే మ‌హేష్ సినిమాలో ఐట‌మ్ సాంగ్ చేసేందుకు నాలుగు కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేసింద‌ని స‌మాచారం.

Rashmika Mandanna remuneration topic now

Rashmika Mandanna remuneration topic now

Rashmika Mandanna : బాగా పెంచేసిందిగా..!

ఈ విష‌యం తెలిసి ప్ర‌తి ఒక్క‌రు అవాక్క‌వుతున్నారు. ఇటీవలె ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకోగా, రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ‌, తండ్రి ఇందిరాదేవి క‌న్నుమూయ‌డంతో షూటింగ్ వాయిదా ప‌డింది. డిసెంబర్ రెండో వారం నుంచి త‌దుప‌రి షెడ్యూల్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక ఇటీవల తెలుగులో సీతారామం అనే సినిమాతో పలకరించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆమె నటించిన మరో సినిమా గుడ్ బై ఇటీవల విడుదలై ఓకే అనిపించుకోగా, ప్ర‌స్తుతం హిందీలో మిషన్ మజ్ను అనే స్పై థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp