Rashmika Mandanna : విజయ్ అంతే తనకు ఎంత ఇష్టమో అసలు సీక్రెట్ చెప్పేసిన రష్మిక

 Authored By jagadesh | The Telugu News | Updated on :27 May 2022,10:00 am

Rashmika Mandanna : రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఇప్పుడు నేషనల్ క్రష్. దేశమంతా పుష్ప సినిమా పుణ్యమాని రష్మిక మందన్న పేరు మారుమోగిపోయింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో రష్మిక టాప్ రేంజ్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తనకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. సౌత్ ఇండియాలో ఇప్పుడు తనే స్టార్ హీరోయిన్. అందుకే.. తనకు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ నటుల సరసన నటించే అవకాశం కూడా లభించింది.

rashmika mandanna comments on her trainer

rashmika mandanna comments on her trainer

రష్మిక.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రణ్ బీర్ కపూర్ తో పాటు తమిళ్ హీరో విజయ్ దళపతి సరసన కూడా నటించబోతోంది. దీంతో తను చాలా హ్యాపీగా ఉంది. వీళ్లందరి సరసన నటించడం అంటే నాకు చాలా గర్వంగా ఉంది. అదంతా దేవుడి దయ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రష్మిక.

Rashmika Mandanna : విజయ్ మీద తనకు అందుకే అంత అభిమానం అట

తమిళ్ హీరో విజయ్ దళపతితో తను సినిమాలో నటిస్తుండటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందట. ఎందుకంటే.. దళపతి విజయ్ అంటే తనకు ఎంతో అభిమానం అట. తనంటే ఎంతో ఇష్టం అట. చిన్నప్పటి నుంచి తనకు ఆయన్ను ఒక హీరోగానే చూస్తోందట.

దళపతి విజయ్ అంటే ఎంత ఇష్టమో తన సినిమా పూజ కార్యక్రమాలలోనే చూపించింది రష్మిక. తనను మొదటిసారి కలవడం అప్పుడేనట. అతడిని అలాగే చూస్తూ ఉండిపోయిందట రష్మిక. అందుకే.. ఆయనకు దిష్టి కూడా తీసిందట. విజయ్ అంటే తనకు అంత ఇష్టం అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రష్మిక.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి