The Girl Friend Teaser Review : ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ రివ్యూ..!
ప్రధానాంశాలు:
The Girl Friend Teaser Review : ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ రివ్యూ..!
The Girl Friend Teaser Review : నేషనల్ క్రష్ రష్మిక మందన్న Rashmika Mandanna నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. The Girl Friend రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది. ఈ టీజర్ కు రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ vijay devarakonda వాయిస్ ఓవర్ అందించారు. ఇక ఒక అమ్మాయి జీవితంలో జరిగే అన్ని విషయాల ఆమె స్వశక్తిగా ఎదిగి తన కాళ్ల మీద తాను ఎలా నిలబడగలుగుతుంది. ఆమె జీవితంలో ప్రేమ మిగతా బంధాలు ఎలా ఉంటాయన్నది ఈ సినిమాలో చూపిస్తున్నారు. ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ లో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఉంటాడా అన్న డౌట్ మొదలైంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ తోనే రష్మిక తన లుక్స్ తో ఆకట్టుకుంది. సినిమా టీజర్ తోనే ఇదొక మంచి చిత్రంగా ఉంటుందని ఫీల్ గుడ్ మూవీ అవుతుందని చూపించారు.
The Girl Friend Teaser Review శ్రీవల్లి పాత్రలో అదరగొట్టేసింది రష్మిక..
ఈమధ్యనే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో అదరగొట్టేసింది రష్మిక. సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ తో పాటు గ్లామర్ డోస్ తో కూడా అదరగొట్టేసింది. ఐతే ది గర్ల్ ఫ్రెండ్ లో రష్మిక లుక్స్ చాలా రీఫ్రెషింగ్ గా ఉన్నాయి. ఆమె ఇప్పటివరకు చేసిన సినిమాలు దేనిలో కూడా ఇలా కనిపించలేదు. ఇక సినిమాలో రష్మిక క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉండేలా కనిపిస్తుంది.
ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క రష్మిక డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తుంది. చిలసౌ తో డైరెక్టర్ గా మెప్పించిన రాహుల్ రవీంద్రన్ నాగార్జునతో చేసిన మన్మధుడు 2 ఫ్లాప్ అయ్యింది. ఐతే ఈ సినిమా మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది. కచ్చితంగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రష్మిక కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని తెలుస్తుంది. మరి టీజర్ తో సూపర్ అనిపించగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. Rashmika Mandanna, Rashmika, The Girl Friend, The Girl Friend Review, Rahul Ravindran