Rashmika Mandanna plays new reporter role
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలి కాలంలో తన అందచందాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ అలరిస్తుంది. అయితే రీసెంట్‌గా బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హోస్ట్ కరణ్ జోహార్ బుధవారం తన 50వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలకు ఆయన పెద్ద పార్టీ ఇచ్చారు. ముంబయిలో ఓ ప్రైవేట్ ఈవెంట్‌గా కరణ్ బర్త్ డే బాష్ జరిగింది. దీనికి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు భారీగా హాజరయ్యారు. రష్మిక మందన్నాతోపాటు విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్ హాజరయ్యారు.
అలాగే పూరీ జగన్నాథ్, ఛార్మి సందడి చేశారు. ఈసందర్భంగా వారి ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.అయితే బర్త్‌డే వేడుకల్లో రష్మిక తన డ్రెస్‌తో కొంత అవస్థ పడినట్లు కనిపించింది. అది కాస్తా కెమెరాలకు చిక్కగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రష్మిక బ్లాక్ డ్రెస్‌లో నడుచుకుంటూ వస్తోంది. ఆ డ్రెస్ కాళ్ల కిందవరకు ఆనుతుండటంతో నడవడానికి కొంత ఇబ్బంది పడింది హీరోయిన్. పదే పదే దాన్ని సర్దుతూ కొంత అసౌకర్యానికి లోనైనట్లు కనిపించింది. ఇది చూసిన జనాలు కంఫర్ట్‌గా లేనప్పుడు అదే డ్రెస్ ఎందుకు వేసుకోవడం అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి డ్రెస్ వేసుకుని అంత ఇబ్బంది పడటం అవసరమా?
Rashmika Mandanna trolled by netigens
అని కామెంట్లు చేస్తున్నారు.మొదట కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ‘ఛలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గీతా గోవిందం, భీష్మ, డియర్ కామ్రెడ్, పష్ప వంటి చిత్రాలతో సక్సెస్ అందుకుంది. తక్కవ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మికకు ఆ వెంటనే హిందీలో ఆఫర్ వచ్చింది. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేసిన ఆమె రణ్‌బీర్ కపూర్ సరసన ఎనియమల్‌లో నటిస్తోంది. అలాగే తెలుగులో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీతో పాటు తమిళ హీరో విజయ్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.