Rashmika mandanna : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప’ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బన్నీకి తోడుగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా నటిస్తోంది. సాధారణంగా అన్ని సినిమాల కంటే ఇందులో రష్మిక చాలా కష్టపడాల్సి వచ్చిందట.. దానికి కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.అల్లు అర్జున్ నటన, డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ ఎనర్జీ ముందు ఎవ్వరైనా తేలిపోతారు. అల్లు అర్జున్ డ్యాన్స్ కు సౌతిండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు.
ముఖ్యంగా తమిళనాడు, కేరళలో బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో బన్నీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంట.. ఎర్ర చందనం స్మగ్లర్‌గా తనను తాను మార్చుకున్నాడు. క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టే ‘తగ్గేదెలే’ అనే ఒక్క డైలాగ్‌తో ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాడు. బన్నీ, రష్మిక తొలిసారి జంటగా నటిస్తున్న మూవీకి సంబంధించి ట్రైలర్ డిసెంబర్ 6న విడుదల కానుంది. అయితే, ఈ మూవీలో రష్మిక డ్యాన్స్ విషయంలో చాలా కష్టపడిందట..
డ్యాన్స్ విషయానికొస్తే అల్లు అర్జున్ మెషిన్ గన్ లాంటోడు. ఒకే సారి పది మూమెంట్స్ వేయమన్న వేసి నిల్చుంటాడు. కానీ బన్నీ అంత స్పీడ్ హీరోయిన్స్‌లో ఉండటం చాలా కష్టం. అందుకే అల్లు అర్జున్‌ను అందుకోవడానికి రష్మిక చాలా కష్టపడిందట.. సామి సామి అనే సాంగ్‌లో ఫర్ ఫెక్ట్స్ మూమెంట్స్ కోసం ఏకంగా 18 గంటలు శ్రమించిందట.. అప్పటికీ గాని ఆమెకు స్టెప్స్ ఓకే అనిపించలేదని సిన్నిహితులు చెబుతున్నారు. శేషాచలం ఫారెస్ట్‌లో ఎర్ర చందనం స్మగ్లర్‌గా బన్నీ నటిస్తుంటే.. చిత్తూరు అమ్మాయి క్యారెక్టర్ అది కూడా డీ గ్లామరస్ పాత్రను రష్మిక పోషిస్తుంది. ఈ సినిమాలో రష్మిక తన నడుం, ఎద అందాలను బాగానే ఆరబోసింది. పైట లేకుండా కేవలం గ్రీన్ కలర్ జాకెట్ ధరించి తన అందాలను చూపించడంతో కుర్రకారు హోరెత్తి పోతున్నారు. కాగా, ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్నది..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.