Rashmika Mandanna : కోపం వస్తే ఇలానే కాలు ఎగరేసి కొడతా.. రష్మిక మందన్నా వీడియో వైరల్
Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎంత బిజీగా ఉన్నా కూడా వర్కవుట్లను మాత్రం అస్సలు మిస్ కాదు. ఉదయాన్నే వర్కవుట్లు చేయాల్సిందే. మళ్లీ రాత్రి షూటింగ్ నుంచి వచ్చాక కూడా వర్కవుట్లు చేయాల్సిందే. అలా వర్కవుట్లకు తగిన సమయాన్ని కేటాయిస్తూ ఎప్పుడూ ఫిట్‌గా ఉంటోంది రష్మిక.

Rashmika Mandanna Workout Video
ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో రెండు, బాలీవుడ్‌లో రెండు మూడు ప్రాజెక్ట్‌లు సెట్స్ మీదున్నాయి. కోలీవుడ్‌లో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చింది. మళ్లీ కొన్ని సినిమాలు చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మాత్రం పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ తెలుగులో బిజీగా ఉంది. ఈ రెండు షూటింగ్‌ల కోసం రష్మిక ఇప్పుడు హైద్రాబాద్‌లోనే ఉంటోంది.
Rashmika Mandanna : వర్కవుట్లతో రష్మిక మందన్నా

Rashmika Mandanna Workout Video
ఇక ఇవి పూర్తయితే మళ్లీ రష్మిక ముంబైకి చెక్కేస్తోంది. అక్కడ రెండు చిత్రాలు సెట్స్ మీదున్నాయి.అయితే రష్మిక తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. తనను ఎవరైనా విసిగిస్తే ఎలా చావగొడుతుందో చూపించింది. వర్కవుట్ సెషన్ వీడియోను షేర్ చేస్తూ.. ఎవరైనా విసిగిస్తే ఇలా తంతాను అంటూ కాలు ఎత్తి మరీ కొట్టేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.