Vallabhaneni Vamsi : పరిటాల సునీతను ఇప్పటికీ అలానే చూస్తా.. వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు
Vallabhaneni Vamsi : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేగుతూనే ఉంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలు రోజురోజుకూ పెరుగుతుండగా, తాజాగా టీడీపీ రెబల్ నేత, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి పరిటాల సునీత మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. పరిటాల సునీత వ్యాఖ్యలకుగాను వంశీ తాజాగా కౌంటర్ ఇచ్చారు.‘ఏపీ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరిట నిర్వహించిన నిరసన దీక్షలో మాజీ మంత్రి పరిటాల సునీత ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అయ్యాక ఒక గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామన్నారు.

vallabhaneni vamsi comments on parital sunitha
తన భర్తను చంపినప్పుడు ఓర్పుగా ఉండాలని చంద్రబాబు సూచించారని గుర్తు చేశారు. మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ సారి ఎన్నికల్లో వల్లభనేని వంశీ, కోడాలి నాని ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. టీడీపీలో వారికి అవకాశం ఇవ్వడం వల్లే ఈ రోజు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారన్న సంగతి గుర్తెరగాలని సూచించారు. తాము వైసీపీ నేతల కంటే ఎక్కువగా మాట్లాడగలమని, కానీ, తమను అలా మాట్లాడొద్దని చంద్రబాబు వారిస్తున్నారని, అందుచేత తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్పుగా ఉంటున్నారని చెప్పారు. ఇకపోతే పరిటాల సునీత వ్యాఖ్యలకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల వరకు ఆగాల్సిన అవసరం లేదని, ఇప్పుడే రాజీనామా చేస్తానని అన్నారు.
Vallabhaneni Vamsi : చంద్రబాబుపై ఫైర్ అయిన వంశీ..

tdp
ఈ మేరకు వంశీ తన లెటర్ హెడ్‌పై సంతకం చేసి ఇవ్వడంతో పాటు తాను రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్‌కు పంపాలని పరిటాల సునీతకు సూచించారు. తాను ఇప్పటికీ పరిటాల సునీతను వదినగానే చూస్తానని అన్నారు.అయితే, చంద్రబాబు నాయుడు తల్లికి, గర్భస్థ శిశువు గొడవ పెట్టగలిగేంత వ్యక్తని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్టును పరిటాల సునీత చదివి ఉంటారని ఆరోపించారు. ఇకపోతే గన్నవరం లేదా గుడివాడకు తాను లేదా కోడాలి నాని మొదలు, చివర కాదని చెప్పారు. దమ్ముంటే టీడీపీ నేత నారా లోకేశ్‌ను గన్నవరంలోనో లేదా గుడివాడలోనో పోటీ చేయాలని సవాల్ విసిరారు.