Home » Entertainment » Rashmika Stunning Look Viral
Entertainment

Rashmika Mandanna : సాగ‌ర‌క‌న్య‌లా మెరిసిపోతున్న ర‌ష్మిక‌… ఏమందం ఇది అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Authored By
Sam C
The Telugu News | Published on: January 10, 2022, 8:00 pm
Advertisement

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన క‌న్న‌డ ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. ఈ అమ్మ‌డు ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల‌లో చ‌క్రం తిప్పుతుంది. చివ‌రిగా పుష్ప చిత్రంలో న‌టించి అల‌రించింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. 2021 చివర్లో విడుదలయినా కూడా ఆ సంవత్సరంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప రికార్డ్ సాధించింది. ఈ సినిమాలో శ్రీవల్లిగా నటించిన రష్మిక అంద‌రిని ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు నిర్మాత‌లకు చుక్క‌లు చూపిస్తుంద‌ట‌. త‌న రెమ్యున‌రేష‌న్ ఒకేసారి పెంచిందట‌.

Advertisement

Rashmika Mandanna టాలీవుడ్ ల‌క్కీ లేడీగా మారిన ర‌ష్మిక‌ మండాన్న‌ :

Rashmika Mandanna stunning look viral

ప్రస్తుతం రష్మిక.. హిందీలో ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌ బై’ సినిమాలు చేస్తోంది. అలాగే తెలుగులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీని చకచకా కంప్లీట్ చేస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. మరోవైపు ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌‌గా రాబోతున్న ‘పుష్ప: ది రూల్‌’ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో భాగమయ్యేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తూ ఉంటుంది.

Advertisement

తాజాగా ఈ ముద్దుగుమ్మ సాగ‌ర‌క‌న్య మాదిరిగా క‌నిపిస్తూ అంద‌రి మ‌తులు పోగొడుతుంది. ర‌ష్మిక ఈ డ్రెస్‌లో క్యూట్ క్యూట్‌గా క‌నిపిస్తూ అంద‌రి మ‌తులు కొల్ల‌గొడుతుంది. ర‌ష్మిక క్యూట్ లుక్స్‌కి నెటిజ‌న్స్ తెగ ఫిదా అవుతున్నారు. వరుస విజయాలతో టాలీవుడ్ లో లక్కీ లేడీగా మారిపోయింది అందాల భామ రష్మిక మందన్న. ఛలో సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైనా రష్మిక. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి బిజీ హీరోయిన్ గా మారింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి