Dhee 14 show : రవికృష్ణ కూడా తగ్గట్లే.. కొత్త ట్రాక్ కోసం పులిహోర కలిపేస్తున్నాడుగా!

 Authored By prabhas | The Telugu News | Updated on :8 January 2022,1:30 pm

Dhee 14 show : సీరియల్ నటుడు రవి కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకాభిమానులు ఉన్నారు. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న రవికృష్ణ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవి కృష్ణ ఢీ కార్యక్రమంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.ఇక వచ్చే వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ ప్రోమోలో భాగంగా నటుడు రవి కృష్ణ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుస్మిత తో లవ్ ట్రాక్ నడపడం కోసం బాగానే పులిహోర కలుస్తున్నట్లు తెలుస్తోంది. మామూలుగా ఈ కార్యక్రమంలో రెండు టీమ్స్ మధ్య పోటీ జరుగుతుంది. ఇలా మొదటి రౌండ్ అయిపోయిన తర్వాత ఏ టీమ్ గెలిస్తే ఇతర టీమ్ వాళ్ళు టాస్క్ చేయాల్సి ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే.

Ravi krishna over action at dhee 14 latest promo goes viral

Ravi krishna over action at dhee 14 latest promo goes viral

Dhee 14 show : నేను నీకు గొడుగు పడతా..

ఇలా పర్ఫామెన్స్ అనంతరం ఒక టాస్క్ లో భాగంగా రవికృష్ణ, సుస్మితతో మాట్లాడుతూ…సు.. నీకు ఏదైనా కష్టం వస్తే చెప్పు నేను గొడుగు పడతా.. నాకు ఏదైనా కష్టం వస్తే నువ్వు గొడుగు పట్టుకో అని తనతో ట్రాక్ కోసం పులిహోర కలుపుతున్న సమయంలో యాంకర్ ప్రదీప్ ఇన్వాల్వ్ అవుతూ ఒక పని చేయండి రా ఇద్దరు గొడుగులు పట్టుకుని, రెండు బ్యాగులు వేసుకుని నువ్వు ఆవిడకి అసిస్టెంట్ గా, ఆవిడ నీకు అసిస్టెంట్ గా ఉండండి సరిపోతుంది అంటూ వీరిద్దరిపై పంచ్ వేశాడు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి