Home » Entertainment » Ravi Teja Dead In Chiranjeevi Movie
Entertainment

Ravi Teja : ర‌వితేజ చ‌నిపోతాడా.. ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 19, 2022, 1:30 pm
Advertisement

Ravi Teja : మాస్ మ‌హరాజా ర‌వితేజ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. వ‌రుస సినిమాలు చేస్తూనే మ‌రోవైపు కీల‌క పాత్ర‌ల‌లో న‌టించేందుకు కూడా ఆస‌క్తి చూపుతున్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో అర డజను పైగా సినిమాలున్నాయి. ఈ యేడాది ఇప్పటికే ‘ఖిలాడి’ మూవీతో పలకరించారు. త్వరలో ‘ధమాకా’తో పాటు ‘రావణాసుర’,తోపాటు తొలి ప్యాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌ వంటి క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఆయా సినిమాలు చేస్తూనే ఈయన చిరంజీవి, బాలకృష్ణ వంటి సినియర్ హీరోల సినిమాల్లో రెండో హీరో పాత్రలు చేయడానికి ఓకే చెబుతున్నారు.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఓ సినిమాలో రవితేజ ఓ కేమియో రోల్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్ర సరికొత్తగా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో రవితేజ పాత్రకు సంబంధంచిన సమాచారం బయటకు వచ్చింది. చిరు సినిమాలో రవితేజ పాత్ర సెకండాఫ్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో రవితేజ పాత్ర మనకు కనిపిస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి తమ్ముడిగా రవితేజ కనిపిస్తాడని.. ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ చనిపోతాడని.. అతడి మరణం తరువాత చిరంజీవి పాత్రలో చాలా మార్పు వస్తుందని కూడా తెలుస్తోంది.

ravi teja dead in chiranjeevi movie

Advertisement

Ravi Teja : ర‌వితేజ పాత్ర‌ని అలా డిసైడ్ చేశారా..

ఈ చిత్రం కోసం ఈ మాస్ హీరో 20 రోజులు డేట్స్ కేటాయించాడని కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఐతే, ఈ వార్తల పై ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. నిజంగానే రవితేజ ఈ సినిమాలో అలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఇటీవల అందరు హీరోలు పాన్ ఇండియా మీద పడ్డారు. దీంతో రవితేజ కూడా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి