Home » Entertainment » Laya Dance To Dj Tillu Movie Song
Entertainment

Viral Video : డీజే టిల్లు సాంగ్ కు త‌ళ్లీకూతుళ్ల మాస్ డ్యాన్స్.. న‌యాలుక్ లో అద‌ర‌గొట్టిన ల‌య‌

Authored By
mallesh
The Telugu News | Updated on: April 19, 2022 12:36 am
Advertisement

Viral Video : హీరోయిన్ ల‌య అంద‌రికీ సుప‌రిచిత‌మే ఒక‌ప్పుడు ఫ్యామిలీ సినిమాల‌కు కేరాఫ్ గా నిలిచింది. వ‌రుసగా సినిమాలు చేసి త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. తెలుగులో ప్రముఖ దర్శకుడు కే.విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన స్వయంవరం చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆక‌ట్టుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపుగా 60 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Advertisement

హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ఓ ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకొని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజ‌ల్స్‌లో సెటిలైంది.అయితే ఇందులో మనసున్న మారాజు, శివరామరాజు, మనోహరం, ప్రేమించు, విజయేంద్ర వర్మ, అదిరింద‌య్యా చంద్రం తదితర చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. మార్యేజ్ త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంది. ప్రస్తుతం ఒక బాబు, పాప కూడా ఉన్నారు. ఆ మధ్య టాలీవుడ్ శ్రీ‌నువైట్ల డైర‌క్ష‌న్ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రంలో తన కూతురు శ్లోక తో కలిసి నటించింది.

Laya dance to DJ Tillu movie song

Advertisement

అయితే సోష‌ల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే ల‌య ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ తెగ వైర‌ల్ అవుతోంది.ఇటీవ‌ల ల‌య త‌న కూతురు శ్లోకాతో కలిసి డ్యాన్స్‌ స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ఇంట‌ర్నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. సిద్దు జొన్న‌ల‌డ్డ న‌టించిన రీసెంట్ ఫిలిమ్ డీజే టిల్లు సినిమాలోని డీజే టిల్లు కొట్టు.. సాంగ్ కి త‌ళ్లీకూతుళ్లు మాస్ డ్యాన్స్ ఇర‌గ‌దీశారు. నెటిజ‌న్స్ లైకులు కొడుతూ కామెంట్స్ పెడుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి