Ravi Teja : ఓరి నాయనో రవితేజ .. ఆ రేంజ్ లో లాగుతున్నాడా ఒక్కొక్క సినిమా కీ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ravi Teja : ఓరి నాయనో రవితేజ .. ఆ రేంజ్ లో లాగుతున్నాడా ఒక్కొక్క సినిమా కీ !

Ravi Teja : ఇటీవల ‘ ధమాకా ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహారాజ్ రవితేజ ‘ రావణాసుర ‘ సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూపోతున్నారు. అందుకే టాలీవుడ్లో ఏడాదికి మూడు సినిమాలు తక్కువ కాకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఏకైక హీరోగా రవితేజ ఉన్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో హిట్ కొట్టిన రవితేజ రావణాసుర సినిమాతో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 May 2023,9:00 am

Ravi Teja : ఇటీవల ‘ ధమాకా ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహారాజ్ రవితేజ ‘ రావణాసుర ‘ సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూపోతున్నారు. అందుకే టాలీవుడ్లో ఏడాదికి మూడు సినిమాలు తక్కువ కాకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఏకైక హీరోగా రవితేజ ఉన్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో హిట్ కొట్టిన రవితేజ రావణాసుర సినిమాతో డీలా పడిపోయారు. ఈ సినిమా ఫలితం కారణంగా నిర్మాతలు రవితేజ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు.

Ravi Teja remuneration matter

Ravi Teja remuneration matter

ఈ క్రమంలోనే రవితేజ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయ్యాక నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలని డిసైడ్ అయ్యారట. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని రవితేజ నమ్ముతున్నాడు. ఈ సినిమా హిట్ అయితే కనుక రవితేజకి పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ పెరుగుతుంది. దీనికోసం రవితేజ చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంత టైగర్ నాగేశ్వరరావు పైనే పెట్టారని తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని భాషలలో స్టార్ నటులతో వాయిస్ ఓవర్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ లైఫ్ రాబిన్ హుడ్ గా పేరుపొందిన స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Hero Ravi Teja is the worst decision

Hero Ravi Teja is the worst decision

వంశీకృష్ణ ఆకెళ్ళ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో రవితేజ కెరీర్ లోనే ఎన్నడూ లేనివిధంగా అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాతో రేణు దేశాయ్ నటిగా రిఎంట్రి ఇస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ నటిస్తుంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ కి పరిచయం కాబోతోంది. ఈమె బాలీవుడ్ లో గాయనిగా, నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఇక టాలీవుడ్లోకి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఏంట్రీ ఇవ్వబోతుంది. ఇక రవితేజ రావణాసుర కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ అది వర్కౌట్ కాలేదు. దీంతో ఎప్పటిలాగే మాస్ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది