
Ravi Teja Remuneration Rumors For Ramarao on Duty
Ravi Teja : మాస్ మహారాజా రవితేజ మీద, ఆయన సెట్‌లో ఉండే తీరు, నిర్మాతలను రెమ్యూనరేషన్‌ల కోసం విసిగించే తీరు మీద రకరకాల రూమర్లు వచ్చాయి. ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తాడని, చివర్లో ఇంకా ఎక్కువ డబ్బులివ్వాలని అంటాడట. ఇలా రవితేజ మీద లెక్కలేనన్ని పిచ్చి వార్తలు వచ్చాయి. రామారావు ఆన్ డ్యూటీ సినిమా విషయంలోనూ రవితేజ మీద ఇలాంటి రూమర్లే వచ్చాయి. చివరి నిమిషంలో డబ్బింగ్‌కు రానని మొండికేశాడట, ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలని అడిగాడట అంటూ రూమర్లు వచ్చాయి. అయితే తాజాగా రవితేజ మాత్రం ఆ రూమర్లపై స్పందిస్తూ కొట్టి పారేశాడు.
అలాంటివన్నీ రూమర్లేనని, లైట్ తీసుకుంటానని చెప్పకనే చెప్పేశాడు రవితేజ. గాసిప్పులు వస్తుంటాయని, అవన్నీ పనీపాటా లేనివాళ్లు రాస్తుంటారని చెప్పుకొచ్చాడు. తాను వాటిని పట్టించుకోనని, చూసి నవ్వుకుంటానంతే అని సింపుల్‌గా తేల్చి చెప్పేశాడు. అలాంటి వాళ్లు కూడా ఉండాలని, లేదంటే టైమ్ పాస్ అవ్వదని కౌంటర్లు వేశాడు. ఈ సినిమాకి తానొక నిర్మాతని, తన బ్యానర్ పేరు పోస్టర్ పై కనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. అలాంటప్పుడు పారితోషికం కోసం తానెందుకు ఇబ్బంది పెడతాను? అని నిలదీశాడు రవితేజ.
Ravi Teja Remuneration Rumors For Ramarao on Duty
పైగా ఈ సినిమా నిర్మాత సుధాకర్ తనకు మంచి స్నేహితుడని, తను చాలా మంచోడని అన్నాడు. తనకెవరకూ శత్రువులు ఉండరని తెలిపాడు. అంత మంచి నిర్మాత ఉన్నప్పుడు తనకెందుకు సమస్యలొస్తాయని రూమర్లను కొట్టిపారేశాడు రవితేజ. మొత్తానికి రామారావు ఆన్ డ్యూటీ డబ్బింగ్ చెప్పనంటూ, డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సిందేనని నిర్మాతను రవితేజ వేధించడం అనేది రూమర్ అని తేలిపోయింది. శరత్ మాండవ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతోన్నాడు. ఇక ఎన్నో ఏళ్ల తరువాత మళ్లీ వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతోనే ఎంట్రీ ఇస్తున్నాడు. సీఐ మురళి పాత్రలో వేణు కనిపించబోతోన్నాడు. మొత్తానికి ఈ మూవీ ట్రైలర్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.