Ravi Teja : పాపం రవితేజ మీద అలాంటి వార్తలు.. లైట్ తీసుకున్న మాస్ మహారాజా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ravi Teja : పాపం రవితేజ మీద అలాంటి వార్తలు.. లైట్ తీసుకున్న మాస్ మహారాజా

 Authored By prabhas | The Telugu News | Updated on :20 July 2022,6:30 pm

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ మీద, ఆయన సెట్‌లో ఉండే తీరు, నిర్మాతలను రెమ్యూనరేషన్‌ల కోసం విసిగించే తీరు మీద రకరకాల రూమర్లు వచ్చాయి. ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తాడని, చివర్లో ఇంకా ఎక్కువ డబ్బులివ్వాలని అంటాడట. ఇలా రవితేజ మీద లెక్కలేనన్ని పిచ్చి వార్తలు వచ్చాయి. రామారావు ఆన్ డ్యూటీ సినిమా విషయంలోనూ రవితేజ మీద ఇలాంటి రూమర్లే వచ్చాయి. చివరి నిమిషంలో డబ్బింగ్‌‌కు రానని మొండికేశాడట, ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలని అడిగాడట అంటూ రూమర్లు వచ్చాయి. అయితే తాజాగా రవితేజ మాత్రం ఆ రూమర్లపై స్పందిస్తూ కొట్టి పారేశాడు.

అలాంటివన్నీ రూమర్లేనని, లైట్ తీసుకుంటానని చెప్పకనే చెప్పేశాడు రవితేజ. గాసిప్పులు వ‌స్తుంటాయని, అవ‌న్నీ ప‌నీపాటా లేనివాళ్లు రాస్తుంటారని చెప్పుకొచ్చాడు. తాను వాటిని ప‌ట్టించుకోనని, చూసి న‌వ్వుకుంటానంతే అని సింపుల్‌గా తేల్చి చెప్పేశాడు. అలాంటి వాళ్లు కూడా ఉండాలని, లేదంటే టైమ్ పాస్ అవ్వ‌దని కౌంటర్లు వేశాడు. ఈ సినిమాకి తానొక నిర్మాత‌ని, తన బ్యాన‌ర్ పేరు పోస్ట‌ర్ పై క‌నిపిస్తోందని చెప్పుకొచ్చాడు. అలాంట‌ప్పుడు పారితోషికం కోసం తానెందుకు ఇబ్బంది పెడ‌తాను? అని నిలదీశాడు రవితేజ.

Ravi Teja Remuneration Rumors For Ramarao on Duty

Ravi Teja Remuneration Rumors For Ramarao on Duty

పైగా ఈ సినిమా నిర్మాత సుధాక‌ర్ తనకు మంచి స్నేహితుడని, తను చాలా మంచోడని అన్నాడు. త‌న‌కెవ‌ర‌కూ శత్రువులు ఉండ‌రని తెలిపాడు. అంత మంచి నిర్మాత ఉన్న‌ప్పుడు తనకెందుకు స‌మ‌స్య‌లొస్తాయని రూమర్లను కొట్టిపారేశాడు రవితేజ. మొత్తానికి రామారావు ఆన్ డ్యూటీ డబ్బింగ్ చెప్పనంటూ, డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సిందేనని నిర్మాతను రవితేజ వేధించడం అనేది రూమర్ అని తేలిపోయింది. శరత్ మాండవ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతోన్నాడు. ఇక ఎన్నో ఏళ్ల తరువాత మళ్లీ వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతోనే ఎంట్రీ ఇస్తున్నాడు. సీఐ మురళి పాత్రలో వేణు కనిపించబోతోన్నాడు. మొత్తానికి ఈ మూవీ ట్రైలర్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది