
reason behind samantha hollywood movie
samantha : ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత పేరు మారు మోగిపోతోంది. అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం సామ్ నుంచి వచ్చే ప్రతీ పోస్టు, అప్ డేట్స్ తెగ వైరల్ అవుతోన్నాయి. విడిపోవడానికి సరైన కారణాలు తెలియక, సామ్ పెట్టే ప్రతీ పోస్ట్ ను ఒక్కో అభిమాన వర్గం ఒక్కో రకంగా అంచనా వేస్తూ రకరకాల కథలు అల్లేస్తున్నారు. మరోవైపు విడాకుల ముందు సామ్ నటించిన ఫ్యామిలీమెన్ సిరీస్ 2 తో పాటు విడాకుల అనంతరం తాను సైన్ చేస్తున్న మూవీస్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తొలిసారిగా హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. భారతీయ రచయిత ఎన్.మురారి రాసిన ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సామ్ ఓ బై సెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘డోంటన్ అబ్బే’ ఫేమ్ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది.ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సామ్ ను ఈ సినిమాకు రికమెండ్ చేసింది రానానే అంటూ ఓ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
reason behind samantha hollywood movie
రానాకు సన్నిహితులైన చిత్ర బృందం… బై సెక్సువల్ రోల్ కోసం నటిని వెతుకుతుండగా అతనే సామ్ పేరును సూచించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో సామ్ వెంటనే ఈ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ తో ఇప్పటికే బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా మంచి నటిగా పేరు సాధించిన సామ్.. ఈ చిత్రం అనంతరం హాలీవుడ్ లోనూ బిజీ కానుంది. ఇక విడాకుల తరువాత సమంత వరుస సినిమాలకు సైన్ ఖాళీ లేకుండా గడుపుతోంది. పుష్ప సినిమాలో స్టైలిష్ స్టార్ తో కలిసి స్టెప్పులు వేయబోతున్న ఐటెం సాంగ్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్‌లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
This website uses cookies.