Samantha : సమంత ఆ నిర్ణయం తీసుకోవడానికి రానానే కారణమా.. వైరల్ న్యూస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : సమంత ఆ నిర్ణయం తీసుకోవడానికి రానానే కారణమా.. వైరల్ న్యూస్..!

samantha : ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత పేరు మారు మోగిపోతోంది. అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం సామ్ నుంచి వచ్చే ప్రతీ పోస్టు, అప్ డేట్స్ తెగ వైరల్ అవుతోన్నాయి. విడిపోవడానికి సరైన కారణాలు తెలియక, సామ్ పెట్టే ప్రతీ పోస్ట్ ను ఒక్కో అభిమాన వర్గం ఒక్కో రకంగా అంచనా వేస్తూ రకరకాల కథలు అల్లేస్తున్నారు. మరోవైపు విడాకుల ముందు సామ్ నటించిన ఫ్యామిలీమెన్ సిరీస్ 2 తో పాటు విడాకుల అనంతరం […]

 Authored By kranthi | The Telugu News | Updated on :1 December 2021,1:00 pm

samantha : ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత పేరు మారు మోగిపోతోంది. అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం సామ్ నుంచి వచ్చే ప్రతీ పోస్టు, అప్ డేట్స్ తెగ వైరల్ అవుతోన్నాయి. విడిపోవడానికి సరైన కారణాలు తెలియక, సామ్ పెట్టే ప్రతీ పోస్ట్ ను ఒక్కో అభిమాన వర్గం ఒక్కో రకంగా అంచనా వేస్తూ రకరకాల కథలు అల్లేస్తున్నారు. మరోవైపు విడాకుల ముందు సామ్ నటించిన ఫ్యామిలీమెన్ సిరీస్ 2 తో పాటు విడాకుల అనంతరం తాను సైన్ చేస్తున్న మూవీస్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ సమంత తొలిసారిగా హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. భారతీయ రచయిత ఎన్.మురారి రాసిన ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సామ్ ఓ బై సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘డోంటన్ అబ్బే’ ఫేమ్‌ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది.ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సామ్ ను ఈ సినిమాకు రికమెండ్ చేసింది రానానే అంటూ ఓ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

reason behind samantha hollywood movie

reason behind samantha hollywood movie

samantha : సమంత హాలీవుడ్ ఎంట్రీ:

రానాకు సన్నిహితులైన చిత్ర బృందం… బై సెక్సువ‌ల్ రోల్‌ కోసం నటిని వెతుకుతుండగా అతనే సామ్ పేరును సూచించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో సామ్ వెంటనే ఈ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ తో ఇప్పటికే బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా మంచి నటిగా పేరు సాధించిన సామ్.. ఈ చిత్రం అనంతరం హాలీవుడ్ లోనూ బిజీ కానుంది. ఇక విడాకుల తరువాత సమంత వరుస సినిమాలకు సైన్ ఖాళీ లేకుండా గడుపుతోంది. పుష్ప సినిమాలో స్టైలిష్ స్టార్ తో కలిసి స్టెప్పులు వేయబోతున్న ఐటెం సాంగ్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది