Home » Entertainment » Rekha Salman Khan Crush Story
Entertainment

రేఖకు లైన్ వేసిన సల్మాన్.. ఆ కథ భలేగా ఉంది!

Authored By
Admin
The Telugu News | Published on: December 28, 2020, 4:30 pm
Advertisement

బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, పెళ్లి కాని ప్రసాద్ ఇలా ఎన్ని రకాలుగా పిలిచినా అది సల్మాన్ ఖాన్‌కు సరిగ్గా సరితూగుతుంది. 55 ఏళ్లు నిండిన సల్మాన్ ఖాన్ పెళ్లి టాపిక్ నిత్యం చర్చల్లోకి వస్తూనే ఉంటుంది. ఈ బ్రహ్మచారి ప్రేమల్లో మునిగి తేలుతుంటాడు. కానీ పెళ్లి పీటల వరకు ఆ వ్యవహారం రాకుండానే మధ్యలో ముగిసిపోతుంది. వీటిపై సల్మాన్ ఏనాడూ కూడా నోరు విప్పలేదు.

Advertisement

Rekha Salman khan Crush Story

ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్‌లతో సల్మాన్ నడిపించి ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. తనను లాగి పెట్టి కొట్టాడని, శాడిస్ట్‌లా హింసించాడని ఐశ్వర్యా రాయ్ ఆ మధ్య సల్మాన్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను కొడితే అసలు బతుకుతారా? అంటూ సల్మాన్ కూడా రివర్స్ కౌంటర్ వేశాడు. అసలు ఈ వివాదాం పక్కన పెడితే.. సల్మాన్ ఖాన్‌కు సీనియర్ హీరోయిన్ రేఖపై ఉన్న క్రష్ గురించి ఆ మధ్య ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

Advertisement

సల్మాన్ ఖాన్ తన టీనేజ్‌లో రేఖ చుట్టూ తిరిగే వాడట. ఆమె యోగా క్లాసులు చెబుతుందని పనిగట్టుకుని మరీ వెళ్లేవాడట. అతను నాతో ప్రేమలో పడ్డాడని ఆ వయసులో అతనికి తెలుసో లేదో కానీ నాకు మాత్రం తెలుసంటూ రేఖ చెప్పుకొచ్చింది. నేను పెద్దయ్యాక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లో వాళ్లతో చెప్పేవాడంటూ సల్మాన్ చిలిపి చేష్టల గురించి రేఖ తెలిపింది. అందుకే నేను పెళ్లి చేసుకోలేదేమో అని రేఖపై సల్మాన్ సెటైర్ వేశాడు.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి