Janhvi kapoor : దేవర కోసం జాన్వి కపూర్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi kapoor : దేవర కోసం జాన్వి కపూర్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :17 September 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Janhvi kapoor : దేవర కోసం జాన్వి కపూర్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా..?

Janhvi kapoor : ఎన్టీఆర్ దేవర సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను కొరటాల శివ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. దేవర సినిమాలో ఎన్ టీ ఆర్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఎన్ టీ ఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. శ్రీదేవి తనయురాలైన జాన్వి కపూర్ కేవలం బాలీవుడ్ లోనే కాదు సౌత్ సినిమాల మీద కన్నేసింది. ముందుగా తెలుగు పరిశ్రమలో ఆమె సత్తా చాటాలని ఫిక్స్ అయ్యింది. దేవర సినిమా లో నటించినందుకు జాన్వి కపూర్ భారీ రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తుంది. దేవర సినిమాలో జాన్వి చేస్తున్న పాత్ర కోసం ఆమె 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుందట.

Janhvi kapoor జాన్వి కపూర్ కి 5 కోట్ల దాకా..

బాలీవుడ్ లో ఆమె ప్రతి సినిమాకు 3, 4 కోట్లు తీసుకుంటుంది. ఐతే దేవరకు వచ్చే సరికి 5 కోట్లు తీసుకుంది. బాలీవుడ్ భామలు సౌత్ సినిమాలు చేయాలంటే వారు మాములుగా తీసుకునే రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ తీసుకుంటారు. బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి వారు అడిగినంత ఇచ్చేస్తారు మన మేకర్స్. అలా జాన్వి కపూర్ కి 5 కోట్ల దాకా పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తుంది. దేవర సినిమా మీద ఎన్ టీ ఆర్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

Janhvi kapoor దేవర కోసం జాన్వి కపూర్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా

Janhvi kapoor : దేవర కోసం జాన్వి కపూర్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా..?

ఐతే దేవర ట్రైలర్ మాత్రం ఆశించిన విధంగా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్ టీ ఆర్ చేస్తున్న సినిమా కాబట్టి దేవర మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఐతే సినిమా ఏమాత్రం తేడా కొట్టినా సరే కొరటాల శివ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది. ఆచార్య తర్వాత కొరటాల శివ చేసిన ఈ దేవర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. సినిమా హిట్ కొడితే మాత్రం రికార్డ్ కలెక్షన్స్ తో ఎన్టీఆర్ స్టామినా ప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి