Varsha – Emmanuel : వర్ష, ఇమాన్యూల్‌ ల్లో ఎవరికి ఎక్కువ పారితోషికం తెలుసా..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: January 8, 2023, 12:50 pm

Varsha – Emmanuel : జబర్దస్త్ ప్రేమ జంట అనగానే ఎక్కువ శాతం మందికి గుర్తు వచ్చే పేర్లు రశ్మి గౌతమ్ మరియు సుధీర్. వీరిద్దరి తర్వాత జబర్దస్త్ లో ఎక్కువగా సందడి చేస్తున్న జంట వర్ష మరియు ఇమాన్యూల్‌. వీరు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇద్దరు మధ్య ప్రేమ ఉందని ప్రేక్షకులంతా భావిస్తున్నారు. కానీ ఇద్దరు మంచి స్నేహితులు మాత్రమే అంటూ వారి సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్య కాలం లో వారిద్దరి మధ్య స్నేహం కూడా చెడి పోయిందని, కేవలం కార్యక్రమాల కోసమే వారు కలిసి ఉంటున్నారని.. కలిసి అప్పుడప్పుడు స్టేజిపై సందడి చేస్తున్నారని బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

అతి త్వరలోనే వీరిద్దరూ వేరు వేరుగా పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇమాన్యుల్ కంటే వర్ష రోజు వారి పారితోషికం ఎక్కువ అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇమాన్యూల్‌ రెమ్యూనరేషన్ పోలిస్తే వర్ష రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉంటుందని స్వయంగా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు వీరిద్దరి జంటను తెగ అభిమానిస్తున్నారు. కనుక ముందు ముందు వీరిద్దరూ మరిన్ని కార్యక్రమాల్లో నటించాలని కోరుకుంటున్నారు.

remuneration of jabardasth varsha and Emmanuel

remuneration of jabardasth varsha and Emmanuel

పారితోషికం విషయంలో వీరిద్దరికీ ఎక్కువ వ్యత్యాసం ఉండడంతో కచ్చితంగా ఇప్పుడు కాకుండా ముందు ముందు అయినా వీరి జోడి విచ్ఛిన్నమయ్య అవకాశాలు లేకపోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం ముందు ముందు మరిన్ని జరగాల్సిన అవసరం ఉంది అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి యొక్క జోడి కి మంచి మార్కులు పడుతున్నాయి. కానీ రెమ్యూనరేషన్ విషయంలో వీరిద్దరూ గొడవపడితే కచ్చితంగా మంచి అవకాశం మిస్ అవుతుంది అంటున్నారు. కనుక వీరికి సమానమైన పారితోషికం ఇవ్వడం బెటర్‌.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  2. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  3. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  4. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  5. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

  6. "Ysrcp : వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమా? పవన్ కల్యాణ్ పార్టీలోకి వరుసగా కీలక నేతలు..!"

  7. "AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. త్వరలోనే ఆ పెద్ద తలకాయల అరెస్ట్ ఖాయం..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp