Renu Desai : ఇంట్లోంచి వెళ్లిపోతోన్నాడు.. అకీరాపై రేణూ దేశాయ్ సంచలన కామెంట్స్

 Authored By prabhas | The Telugu News | Updated on :30 July 2022,9:20 pm

Renu Desai : అకీరా నందన్ ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. రేణూ దేశాయ్, ఆద్య, అకీరా ఇలా అందరూ కూడా మొన్నటి వరకు స్కాట్లాండ్‌లోనే ఉన్నారు. ఇంకా అక్కడే ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక అకీరా మొన్ననే తన ఇంటర్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక ఉన్నత విద్య కోసం అకీరా సన్నద్దం అవుతున్నట్టు కనిపిస్తోంది. అకీరా ఏం చేస్తాడు.. ఏం చదువుకుంటాడు.. సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు? అని ఇలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఎదురుచూస్తూనే ఉంటారు. అకీరా టాలెంట్స్ గురించి రేణూ దేశాయ్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటుంది.

చదువుల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, మ్యూజిక్ టాలెంట్.. బాక్సింగ్ టాలెంట్.. ఇలా అకీరా గురించి ఎంతో గొప్పగా చెబుతుంటుంది. మ్యూజిక్‌లో మాస్టర్స్ చేస్తాడేమో అని ఆ మధ్య అకీరా గురించి రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. కానీ అకీరా ఏం చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదేమో. మొత్తానికి ఇప్పుడు మాత్రం ఈ ఫ్యామిలీ ట్రిప్‌ను అందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆద్య అయితే కారులో ఫుల్ చిల్ అవుతోంది. కారులో ఏదో కూని రాగాలు తీస్తుంటే.. వాటిని రేణూదేశాయ్ తన కెమెరాలో బంధించింది. అలా మొత్తానికి రేణూ దేశాయ్ మాత్రం ఆ ట్రిప్‌లో తన పిల్లల గురించి చెబుతూ మురిసిపోతోంది.

Renu Desai About akira Nandan Enjoying Vacation AT Scottland

Renu Desai About akira Nandan Enjoying Vacation AT Scottland

అయితే రెక్కలు వచ్చిన పక్షులు తమ గూడుని వదిలి ఎలా వెళ్లిపోతాయో.. అలా అకీరా కూడా ఇప్పుడు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడట. అంతకు మునుపే తన రెక్కలను ఇలా సరి చేసుకుంటున్నాడట. మొత్తానికి అకీరా చదువుల కోసం ఇంటి నుంచి వెళ్తున్నాడు.. దూరంగా ఉండబోతోన్నాడు అని ఇలా హింట్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. అసలే పవర్ స్టార్ అభిమానులు.. అకీరా ఎంట్రీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అకీరా ఎంట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందా? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అకిరా మాత్రం విదేశాల్లోనే తన ఉన్నత విద్యను పూర్తి చేస్తాడని తెలుస్తోంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి