Indra Movie : ఇంద్ర సినిమాను బి. గోపాల్ చేయ‌న‌న్నాడా… ఎందుకో తెలుసా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Indra Movie : ఇంద్ర సినిమాను బి. గోపాల్ చేయ‌న‌న్నాడా… ఎందుకో తెలుసా

Indra Movie : చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం ఇంద్ర‌. ఈ సినిమా ఇప్ప‌టికీ టీవీల‌లో మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో దూసుకుపోతుంది. అశ్వనీదత్ నిర్మించిన ఆ సినిమాకి బి. గోపాల్ దర్శకత్వం వహించగా సంభాషణలను పరుచూరి బ్రదర్స్ అందించారు. ఇటీవలే ఆ సినిమా 20 ఏళ్లను పూర్తి చేసుకుంది. అయితే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమాని చేసేందుకు బీ గోపాలో నో చెప్పాడ‌ట‌. అందుకు గ‌ల కార‌ణాలు ఏంట‌నేది ఈ వీడియో చూస్తే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :30 July 2022,9:00 pm

Indra Movie : చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం ఇంద్ర‌. ఈ సినిమా ఇప్ప‌టికీ టీవీల‌లో మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో దూసుకుపోతుంది. అశ్వనీదత్ నిర్మించిన ఆ సినిమాకి బి. గోపాల్ దర్శకత్వం వహించగా సంభాషణలను పరుచూరి బ్రదర్స్ అందించారు. ఇటీవలే ఆ సినిమా 20 ఏళ్లను పూర్తి చేసుకుంది. అయితే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమాని చేసేందుకు బీ గోపాలో నో చెప్పాడ‌ట‌. అందుకు గ‌ల కార‌ణాలు ఏంట‌నేది ఈ వీడియో చూస్తే మీకు అర్ధం అవుతుంది. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. చిరంజీవి కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన ఇంద్ర చిత్రం ఇటీవ‌ల 20 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో ఆ సినిమాను గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ..

‘ఇంద్ర’ సినిమాను కనుక చేసి ఉండకపోతే మేమంతా కూడా ఒక వైభవాన్ని అనుభవించి ఉండకపోయేవాళ్లం. రెండు దశాబ్దాల తరువాత కూడా ఆ సినిమాను గురించి మాట్లాకుంటూ ఉండటమే ఆ సినిమా గొప్పతనం. ఇంద్ర సినిమా అంత పెద్ద హిట్ అయింది అంటే చిన్నికృష్ణ కథ, పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్స్‌, బి.గోపాల్‌ దర్శకత్వం, చిరంజీవి నటనే కారణం.అంత గొప్ప సినిమా కథను మొదట బి.గోపాల్‌ వద్దన్నారు. ఆయన తెరకెక్కించిన గత రెండు చిత్రాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడులోని హీరోల పాత్ర చిత్రీకరణ కాస్త ఈ సినిమాలో ఉన్నట్లే ఉంది. కాబట్టి మళ్లీ అలాంటి సినిమానే చేస్తే ఏమవుతుందోనని భయపడ్డాడే తప్ప కథ బాలేదని మాత్రం అనలేదు. నేను చెబితే ఆయన ఒప్పుకోకపోవడంతో చిరంజీవిగారితో చెప్పించి ఒప్పించవలసి వచ్చింది. అలాంటి సినిమా ఎంతటి చరిత్రను సృష్టించిందో మీకు తెలుసు. ‘సమరసింహారెడ్డి’ సినిమాలో సత్యనారాయణగారు బాలయ్యబాబుకి నమస్కారం పెడతారు.

B Gopal wants to make Indra movie on Chiranjeevi

B. Gopal wants to make Indra movie on Chiranjeevi

అలా ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవికి ప్రకాశ్ రాజ్ నమస్కారం పెడతారు. మళ్లీ అలాంటి సీన్ వద్దని గోపాల్ గారు గొడవ. అక్కడ ఉన్నది బాలయ్య .. ఇక్కడ ఉన్నది చిరంజీవి చూస్తారయ్యా అని నేను. మొత్తానికి ఈ విషయంలో కూడా నేను ఆయనను ఒప్పించాను. ‘ఇంద్ర’ సినిమాలో తనికెళ్ల భరణి చేసిన పాత్రను నేను వేయవలసింది .. కానీ మోకాలు నొప్పివలన వేయలేకపోయాను. చిరంజీవి చాలా సినిమాల్లో చాలా పవర్ఫుల్ డైలాగులు చెప్పి ఉండొచ్చు. కానీ ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అనే డైలాగే ముందుగా అందరికీ గుర్తొస్తుంది. అవార్డుల కోసం చూసుకుంటే కొన్ని డైలాగులు మిస్సవుతాము. ఎక్కువసార్లు డైలాగ్ రైటర్లుగా మాకు నంది అవార్డులు వచ్చింది లేదు. అవార్డుల కోసం మేము ఎప్పుడూ డైలాగులు రాయలేదు .. వాటికోసం పాకులాడింది లేదు. అయినా ప్రేక్షకుల అభిమానానికి మించిన అభిమానం ఏవుంటుంది? ‘నరసింహనాయుడు’ ..

‘ఇంద్ర’ ఫంక్షన్లు రెండూ ఒకే ఊళ్లో జరిగాయి. ఒక జీవితకాలంపాటు గుర్తుండిపోయే ఫంక్షన్లు అవి. అభిమానులకి ఒక పాత్ర నచ్చితే ఎంతగా ప్రేమిస్తారనడానికి ‘ఇంద్ర’ ఒక నిదర్శనం. మేము రాసిన హీరోలందరి అభిమానులు మమ్మల్ని అభిమానిస్తారు .. అది మేము చేసుకున్న అదృష్టం. వీలైతే ఆ సినిమా మళ్లీ ఒకసారి చూడండి” అంటూ చెప్పుకొచ్చారు. కొన్ని పొరపాట్లను కొందరు ప్రేక్షకులు లోతుగా పరిశీలిస్తూ ఉంటారు.వాటిని వెంటనే నెట్టింట్లో పెట్టి ఆ సినిమా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు.అలా ఇప్పటికీ చాలామంది సినిమాల్లో వచ్చిన పొరపాట్లు గురించి సోషల్ మీడియాలో పెట్టి బాగా ట్రోల్స్ చేశారు.కొన్నిసార్లు దర్శకులు, ఎడిటర్లు కూడా ఇటువంటి పొరపాట్లు పూర్తిగా పరిశీలించి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వాటిని కనిపించకూడదని కొన్ని జాగ్రత్తలు పడుతూ ఉంటారు.

20 ఏళ్ల క్రితం విడుదలైన ఇంద్ర సినిమాలోని తప్పులను ఇప్పుడు బయట పెడుతున్నారు నెటిజన్లు.ఇంతకూ ఆ తప్పు ఏంటో కూడా చూద్దాం. ఈ సినిమాలో చిరంజీవి, సోనాలి బింద్రే. రాధే గోవింద అనే పాటకు స్టెప్పులు వేయగా అందులో.చిరంజీవి సోనాలి బింద్రేను చూసి జడతో నా మనసు లాగేసిందా అంటూ ఒక లైన్ పాడుతూ తన జడను చూపించబోతాడు.కానీ అందులో తన జడ కనిపించదు.దీనిని తీసుకొని ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు అందులో చిరంజీవి ఎక్స్ప్రెషన్స్ చూసి.చిరంజీవి కూడా జడ లేనందుకు షాక్ అయ్యారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ పొరపాటు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది