Renu Desai : రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివ్‌గా ఏమీ ఉండదు. అవసరం మేరకు స్పందిస్తుంటుంది. ఆమె చేసే పోస్టులన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. రేణూ దేశాయ్ ఎక్కువగా పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి అంటూ ఇలాంటి సహజ పోస్టులే చేస్తుంటుంది. లేదంటే తన బిడ్డల గురించి చెబుతూ పోస్టులు వేస్తుంది. ఆద్య అల్లరి, అకీరా నందన్ టాలెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటుంది. అలా రేణూ దేశాయ్ నిత్యం ఏదో ఒక పోస్ట్ వేస్తుంటుంది. అయితే కరోనా సమయంలో రేణూ దేశాయ్ ఎంతో మందికి సాయం చేసింది. ఎన్నో స్వచ్చంద సంస్థలతో కలిసి పని చేసింది.
థర్డ్ వేవ్ సమయంలో మాత్రం రేణూ దేశాయ్ సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చింది. కరోనాతో తన కుటుంబం అంతా కూడా బాధపడింది. అలా రేణూ దేశాయ్ కొన్ని రోజులు షూటింగ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే తాజాగా రేణూ దేశాయ్ ఓ పోస్ట్ వేసింది. అందులో ఓ సర్వే గురించి సంచలన నిజాలు చెప్పింది. సన్ స్క్రీన్ వాడే వారు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారట. అమెరికాలో ఈ సర్వే జరిగినట్టు.. అక్కడ ఇలాంటి బాధితులే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై రేణూ దేశాయ్ స్పందించింది. ఇంత వరకు నా జీవితంలో నేను ఒక్కసారిగా కూడా అవి వాడలేదు..
అంతే కాదు అకీరా, ఆద్యలను కూడా నేను వాడనివ్వను.. ఫ్యాషన్ ట్రెండ్లను గుడ్డిగా ఫాలో అవ్వడం ఆపండి అంటూ రేణూ దేశాయ్ అందరినీ హెచ్చరించింది. మొత్తానికి సన్ స్క్రీన్లు, లోషన్లు అంటూ ఇప్పటి యువత ఎంతలా వాడేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి రేణూ దేశాయ్ మాత్రం వాటికి దూరంగానే ఉంటుందట. రేణూ దేశాయ్ మళ్లీ నటిగా బిజీ అవుతోంది. ఆల్రెడీ ఆద్య అనే వెబ్ సిరీస్ రన్నింగ్‌లో ఉంది. అది ఎంత వరకు వచ్చిందో తెలియడం లేదు. కానీ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రేణూ దేశాయ్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద రీఎంట్రీ ఇవ్వబోతోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.