Renu Desai : నా జీవితంలో అదెప్పుడూ వాడలేదు.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 17, 2022, 9:30 pm

Renu Desai : రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివ్‌గా ఏమీ ఉండదు. అవసరం మేరకు స్పందిస్తుంటుంది. ఆమె చేసే పోస్టులన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. రేణూ దేశాయ్ ఎక్కువగా పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి అంటూ ఇలాంటి సహజ పోస్టులే చేస్తుంటుంది. లేదంటే తన బిడ్డల గురించి చెబుతూ పోస్టులు వేస్తుంది. ఆద్య అల్లరి, అకీరా నందన్ టాలెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటుంది. అలా రేణూ దేశాయ్ నిత్యం ఏదో ఒక పోస్ట్ వేస్తుంటుంది. అయితే కరోనా సమయంలో రేణూ దేశాయ్ ఎంతో మందికి సాయం చేసింది. ఎన్నో స్వచ్చంద సంస్థలతో కలిసి పని చేసింది.

థర్డ్ వేవ్ సమయంలో మాత్రం రేణూ దేశాయ్ సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చింది. కరోనాతో తన కుటుంబం అంతా కూడా బాధపడింది. అలా రేణూ దేశాయ్ కొన్ని రోజులు షూటింగ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే తాజాగా రేణూ దేశాయ్ ఓ పోస్ట్ వేసింది. అందులో ఓ సర్వే గురించి సంచలన నిజాలు చెప్పింది. సన్ స్క్రీన్ వాడే వారు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారట. అమెరికాలో ఈ సర్వే జరిగినట్టు.. అక్కడ ఇలాంటి బాధితులే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై రేణూ దేశాయ్ స్పందించింది. ఇంత వరకు నా జీవితంలో నేను ఒక్కసారిగా కూడా అవి వాడలేదు..

Renu Desai About Using Sun Screens Causes cancer

Renu Desai About Using Sun Screens Causes cancer

అంతే కాదు అకీరా, ఆద్యలను కూడా నేను వాడనివ్వను.. ఫ్యాషన్ ట్రెండ్లను గుడ్డిగా ఫాలో అవ్వడం ఆపండి అంటూ రేణూ దేశాయ్ అందరినీ హెచ్చరించింది. మొత్తానికి సన్ స్క్రీన్లు, లోషన్లు అంటూ ఇప్పటి యువత ఎంతలా వాడేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి రేణూ దేశాయ్ మాత్రం వాటికి దూరంగానే ఉంటుందట. రేణూ దేశాయ్ మళ్లీ నటిగా బిజీ అవుతోంది. ఆల్రెడీ ఆద్య అనే వెబ్ సిరీస్ రన్నింగ్‌లో ఉంది. అది ఎంత వరకు వచ్చిందో తెలియడం లేదు. కానీ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రేణూ దేశాయ్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద రీఎంట్రీ ఇవ్వబోతోంది.

Renu Deai About Using Sun Screens Causes cancer

Renu Deai About Using Sun Screens Causes cancer

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp