
sai pallavi special song in pushpa 2
Sai Pallavi : లేడి పవర్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటన, డ్యాన్స్ పరంగా సాయి పల్లవి ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. సాయి పల్లవి ఉందంటే చాలు సినిమాను చూడాల్సిందే అని సగటు సినీ ప్రేక్షకుడు అనుకునే స్థాయికి చేరుకుంది. సాయి పల్లవి కోసమే సినిమాను చూసే అభిమానులున్నారు. సాయి పల్లవి డ్యాన్స్ చేస్తుంటే.. పక్కన ఏ స్టార్ హీరో ఉన్నా కూడా దిగదుడుపే అవుతాడు. సాయి పల్లవి నటన ముందు ఎవ్వరైనా తేలిపోవాల్సిందే. అంతలా సాయి పల్లవి మ్యాజిక్ చేస్తుంది. అందుకే అందరూ ఆమె ఫిదా అవుతారు.
ఆమె ఆఫ్ స్క్రీన్ బిహేవియర్, మాట్లాడే తీరు, కట్టూబొట్టూ ఇలా అన్నీ కూడా ఆమెపై గౌరవాన్ని పెంచేస్తుంటాయి. సాయి పల్లవి ఏ రోజు కూడా గ్లామర్ షో చేయలేదు. సౌందర్యం అంటే.. కనిపించేది కాదని నమ్ముతుంటుంది సాయి పల్లవి. అలా సాయి పల్లవి మరోసారి విరాట పర్వం అనే సినిమాతో తెలుగు వారిని కట్టి పడేసేందుకు వచ్చింది. నేడు విడుదలైన విరాట పర్వం చిత్రంలో వెన్నెల పాత్ర పోషించి అందరి మనసులు గెలుచుకుంది. అయితే సాయి పల్లవి త్వరలో మాస్ మసాలా సాంగ్ చేయనుందని సమాచారం. ఇటీవల ఓ సందర్భంలో త్వరలో తాను స్పెషల్ సాంగ్ చేస్తానని చెప్పకనే చెప్పింది. పుష్ప2లో సాయి పల్లవి స్పెషల్ సాంగ్ చేస్తుందని చెబుతున్నారు.
sai pallavi special song in pushpa 2
అల్లు అర్జున్ లాంటి డ్యాన్సర్‌తో సాయి పల్లవి స్టెప్పులు వేస్తే ఇక థియేటర్‌లో అల్లర్లు భీబత్సంగా ఉండవని అర్ధమవుతుంది. విల్లుగా వంగుతుంది. మెరుపులా తళుక్కుమంటుంది. నృత్యానికి చిరునామాలా ఉంటుంది. సహజత్వానికి పెద్ద పీట వేస్తుంది. నవ్వితే హృదయ పరిమళంలా ఉంటుంది. సాయి పల్లవి. డ్యాన్సుకి మరో పేరు. ‘ఫిదా’ సినిమా తరువాత- తనో ప్రత్యేక పీస్‌గా తెలుగు ప్రేక్షకుల కన్నుల్లో నిండిపోయింది. అర్థవంతమైన కథలను ఎంచుకుంటుంది. అస్తవ్యస్తంగా వస్త్రధారణ చేయనంటుంది. హుందా అయిన పాత్రలకే తన ప్రాధాన్యం అంటుంది. ఇంకా చాలా విషయాల్లో తన అభిప్రాయాలతో, ఆచరణతో మంచి మనిషిగా మనకు మరింత దగ్గర అవుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.