Renu Desai : పెళ్ళిలో సందడి చేసిన రేణు దేశాయ్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
renu desai : కరోనా సెకండ్ వేవ్ తో మళ్ళీ దాదాపు మూడు నాలుగు నెలలు అన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ విధించడంతో షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపడి సినిమా రిలీజ్ లు కూడా ఆగిపోయాయి. దాంతో కొందరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటే రేణు దేశాయ్ లాంటి వారు మాత్రం రెండు మూడు నెలలుగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్నారు. అంతక ముందు చాలా యాక్టివ్ గా ఉన్న ఆమె పలు వ్యక్తిగత విషయాలతో పాటు ఆమె పాల్గొంటున్న షోలకి సంబంధించి, సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్ అనీ ఇక్కడ ఇస్తూ వస్తున్నారు. అంతేకాదు కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి సహాయం కూడా చేశారు. కొన్ని స్వచ్చంద సంస్థలతో కలిసి రేణు దేశాయ్ చాలామంది ఆకలిని తీర్చారు.
renu desai photos in marraige goes viral
అయితే ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయేసరికి ఆమె అభిమానులు ఇకపై ట్విట్టర్, ఇన్స్టా వంటి వాటిలో కనిపించరేమో అని ఫీలయ్యారు. తాజాగా వారికి ఓ పోస్ట్ పెట్టి సర్‌ప్రైజ్ ఇచ్చారు రేణు దేశాయ్. సెకండ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రం ఉండటంతో బయటి పరిస్థితులు దారుణంగా మారాయి. అందుకే ఇంట్లోనే ఉండిపోయాను. బయట షూటింగ్‌లకు కూడా వెళ్లలేదు. చాలా భయంగా అనిపించింది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నారు. వారిని రిస్క్ లో పడేయాలనుకోలేదు. అందుకే డ్రామా జూనియర్స్ షోకు కూడా వెళ్లడం లేదు అని రేణు దేశాయ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
renu desai : నిజంగానే కంఫర్ట్‌గా ఉంటామా?
renu desai photos in marraige goes viral
ఇక తాజాగా రేణు దేశాయ్ renu desai మళ్ళీ బయటకి వచ్చారు. అత్యంత సన్నిహితుల ఇంట్లో పెళ్లి ఉండటంతో హాజరయ్యారు. ఈ విషయాన్ని ఆమె తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు. “చాలా రోజుల తరువాత ఇలా బయటకు వచ్చాను.. పెళ్లికి వచ్చాను.. ఇప్పుడు మాస్క్ ధరించడం జనజీవనంలో సాధారణంగా మారిపోయింది. ఇకపై మనం మాస్క్ లేకుండా నిజంగానే కంఫర్ట్‌గా ఉంటామా? అని ఆశ్చర్యం వేసింది.” అని రేణు దేశాయ్ ట్వీట్ లో రాసుకొచ్చారు. ఇదే సందర్భంలో ఆమె చేస్తున్న రైతు సినిమా గురించి మాట్లాడుతూ.. “మళ్లీ వచ్చే వేసవి వరకు ఆగాల్సిందేనని, ఆ సమయంలోనే షూటింగ్ చేయాల్సి ఉంటుంది.” అని రేణు దేశాయ్ లైవ్‌లో వెల్లడించారు.
