Home » Entertainment » Anchor Rashmi Gautam About Pet Ishaan
Entertainment

Rashmi Gautam : ఆరంతస్థుల భవనం నుంచి పడిపోయింది.. యాంకర్ రష్మీ ఆవేదన

Authored By
Cinema Desk
The Telugu News | Published on: August 18, 2021, 6:30 am
Advertisement

Rashmi Gautam యాంకర్ రష్మీ Rashmi Gautam మూగ జీవాల కోసం ఎంతలా పాటు పడుతుందో అందరికీ తెలిసిందే. ఎక్కడ ఏ వీధి కుక్కకు ఏమైనా కూడా స్పందిస్తుంటుంది. అలాంటి రష్మీ మూగ జీవాల కోసం ఎక్కువగా సహాయ కార్యక్రమాలు చేస్తుంటుంది. తాజాగా ఇషాన్ అనే కుక్క ఆరంతస్థుల భవనం నుంచి కిందపడిందట. దాన్ని నెల రోజుల నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఇంకా సమస్య కొలిక్కి రాలేదట. ఆపరేషన్ చేయాలి, ఇంటెన్సివ్ కేర్‌లో ఉంటాలని రష్మీ చెబుతోంది.

Advertisement

Anchor Rashmi Gautam About Pet Ishaan

ఆరంతస్థుల భవనం నుంచి పడిపోయింది.. యాంకర్ రష్మీ ఆవేదన Rashmi Gautam

దాని కోసం రోజువారి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయట. ఇక మందుల కోసం కూడా ఖర్చులు భారీగా అవుతున్నాయట. అయితే ఆ కుక్కను రెస్క్యూ చేసిన మహిళకు అంత స్థోమత లేదని, తన వద్దకు వచ్చి సాయం కోరిందని రష్మీ చెప్పుకొచ్చింది. తన వంతు సాయం తాను చేస్తున్నానని రష్మీ Rashmi Gautam తెలిపింది. మీరు (ఫాలోవర్స్) మీకు చేతనైన సాయాన్ని చేయండని తన అభిమానులను రష్మీ వేడుకుంది. పది లక్షలు ఒక్కరే ఇవ్వడం వేరు. పది లక్షల మంది ఒక్కో రూపాయి ఇవ్వడం వేరని తెలిపింది.

Advertisement

Rashmi Gautam

3.5 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రూపాయి ఇచ్చినా చాలని అంది. ఇషాన్ అనే ఈ కుక్కను ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అది మంచిగా అయి తిరిగి బయటకు వచ్చి.. దాని కాళ్ల మీద అది నిలబడితే మళ్లీ రోడ్డు మీద వదిలే సమస్యే లేదు. దాన్ని కచ్చితంగా దత్తత తీసుకుంటాను. ఇంత చేశాక దాన్ని రోడ్డు మీద వదిలేయలేమని రష్మీ Rashmi Gautam చెప్పుకొచ్చింది. ఇదంతా చెప్పేందుకు నిన్న సడెన్‌గా లైవ్‌లోకి రష్మీ వచ్చింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి