renu desai : రేణు దేశాయ్ ఆస్తి అన్ని కోట్లా ..?
renu desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి వైరల్ అవుతోంది. 20 ఏళ్ళ క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆయన డెబ్యూ సినిమా బద్రి. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన రేణుదేశాయ్, అమీషా పటేల్ నటించారు. ఈ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ ప్రేమలో పడి చాలా కాలం సహజీవనం చేశారు. ఫలితంగా అకీరా నందన్ పుట్టాడు. ఆ తర్వాత పవన్ – రేణు పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి కాపురం మూడేళ్ళు సజావుగా సాగింది.
ఆ తర్వాత ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. అయితే విడిపోయే సమయంలో పవన్ ..రేణుకి కొంత మొత్తం డబ్బు, ఓ ఇల్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్పుడే హైదరాబాద్ లో ఓ ఖరీదైన ఇల్లు, కార్లు ఇచ్చాడట. ఇద్దరిపిల్లల పేర్ల మీద కొంత స్థిరాస్థులు రాసీచ్చినట్టు సమాచారం. విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ బుల్లితెర మీద షోస్ కి జడ్జ్ గా వ్యవహరిస్తూ మంచి రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఈ విధంగా కూడా రేణు సంపాదన బాగానే ఉందట.

Renu Desai interesting Update
renu desai : రేణు దేశాయ్ ఆస్థుల గురించి అంతటా ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.
అయితే ఇప్పుడు రేణు దేశాయ్ ఆస్థుల గురించి అంతటా ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఆమె ఆస్థులు దాదాపు 40 కోట్లకి పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల ఆమె రెండవ వివాహం చేసుకున్నారు. తన భర్తతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒకవైపు టీ.వి. షోలు చేస్తున్న రేణు దేశాయ్ దర్శకురాలిగాను మారారు. రేణుకి సినిమాకి సంబంధించిన 24 విభాగాల మీద మంచి గ్రిప్ ఉంది. ముఖ్యంగా కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డైరెక్షన్ మీద పట్టుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో సాంగ్ ఎడిట్ చేసిన రేణు ఇప్పటి వరకు ఆ క్రెడిట్ తీసుకోలేదు.