Renu desai : చిన్న చిన్న వాటిని పట్టించుకోవడం మానేశాం.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సూక్తులు చెప్పడంలోనూ, కవితలు వల్లించడంలోనూ, తన అనుభూతులను చెప్పడంలోనూ రేణూ దేశాయ్ ముందుంటుంది. ప్రస్తుతం రేణూ దేశాయ్ తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. ఆద్య అనే ప్యాన్ ఇండియన్ వెబ్ సిరీస్‌తో డే అండ్ నైట్ షూటింగ్‌లతో సందడి చేస్తోంది. మొన్నటి వరకు కాస్త గ్యాప్ ఇచ్చింది. సింగర్ సునీత పెళ్లి కోసం మధ్యలో కొన్ని రోజులు షూటింగ్‌కు డుమ్మా కొట్టేసింది.

Renu desai Quote about Joy And Life
రేణూ దేశాయ్ వెబ్ సైట్లపై ఫైర్
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, రూమర్లను రెగ్యూలర్‌గా ఫాలో అవుతుంటుంది. తప్పుడు వార్తలు వస్తే వాటిని వెంటనే ఖండిస్తూ ఉంటుంది. మొన్నీ మధ్యే తనపై వచ్చిన రూమర్లు, రాసిన వెబ్ సైట్లపై ఫైర్ అయింది. తనకు కరోనా పాజిటివ్ అంటూ వచ్చిన రూమర్లపై ఫైర్ అయింది. అలాంటి స్టుపిడ్ వెబ్ సైట్లను నమ్మకండంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాజాగా రేణూ దేశాయ్ అందరినీ ఆలోచనలో పడేసే మాటలను చెప్పింది.
మామూలుగా మనం రోజూ ఉదయాన్నే లేవడం, ఎంతో ఆరోగ్యంగా ఉండటమనేదే గొప్ప వరం లాంటిది. కానీ అలాంటి చిన్న చిన్న వాటిని మనం అంతగా పట్టించుకోం ఎందుకంటే మనం పెద్ద పెద్ద కోరికలతో సతమతమవుతుంటాం. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలి.. కెరీర్ గురించి ఆలోచిస్తూ.. సంతోషకరంగా లేని రోజులను గుర్తు చేసుకుంటుంటాం. కానీ జీవితం మనకు ప్రసాదించిన చిన్న చిన్న సంతోషాలను పట్టించుకోవాలి.. వాటిపై ఫోకస్ పెట్టుకోండి.. చిన్న వాటిని సంతోషించండి.. నవ్వండి.. అంటూ చెప్పుకొచ్చింది.