
Renu Desai : రెండో పెళ్లికి రెడీ అయిన రేణూ దేశాయ్.. ఇన్నాళ్లు చేసుకోకపోవడానికి కారణం..?
Renu Desai : పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికలలో గెలిచినప్పటి నుండి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తుంది.తరచూ తన తనయుడు అకిరా గురించిను విషయాలను షేర్ చేస్తున్నారు. గెలుపు అనంతరం జనసేనాని తన తనయుడు అకిరా నందన్ తన పక్కనే పెట్టుకున్నాడు. ఎటూ వెళ్లిన తనయుడిని వెంటబెట్టుకునే ఉంటున్నారు. అకిరాతో కలిసి మంగళగిరికి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిశారు. అకిరాను కూడా చంద్రబాబుకి పరిచయం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు. అప్పుడు కూడా అకిరా పవన్ పక్కనే ఉన్నాడు.
అకిరా ప్రధాని కలవడంపై రేణు దేశాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అకిరా ప్రధానితో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఒక తల్లిగా తనకు ఇది ఎనలేని సంతోషాన్ని ఇచ్చిన సందర్భం ఇదని, అకిరాని అలా ప్రధాని పక్కన చూసి తన మనసు ఉద్వేగానికి లోనైందంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇక రేణూ దేశాయ్ షేర్ చేసిన పిక్ కూడా ఒకటి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అకీరా, మోదీ కలిసి ఉండగా, అందులో పవన్ లేడు. దాంతో అసలు అకిరా వెళ్లిందే పవన్ కళ్యాణ్ వల్ల కానీ, ఆయన ఫోటో లేకుండా క్రాప్ చేసి కేవలం అకిరా ఉన్నదే షేర్ చేయడమేంటని ఓ నెటిజన్ రేణు దేశాయ్‌ని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. మీరు ఏడ్చింది చాలు. ఇది క్రాప్డ్ ఫోటో కాదు. కేవలం అకిరా, పీఎం గారు మాత్రమే దిగిన ఒరిజినల్ ఫోటో అని చెప్పుకొచ్చింది.
Renu Desai : రెండో పెళ్లికి రెడీ అయిన రేణూ దేశాయ్.. ఇన్నాళ్లు చేసుకోకపోవడానికి కారణం..?
ఇక రేణూ దేశాయ్‌కి రెండో పెళ్లి గురించి కూడా ప్రశ్న ఎదురైంది. మరో రెండు మూడేళ్లలో కచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటానని కుండబద్దలు కొట్టింది. అయితే ఇప్పటికే మ్యారేజ్ చేసుకోకపోవడానికి అసలు కారణాలను బయటపెట్టింది రేణు. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం అప్పుడు అకీరా, ఆద్య చిన్నగా ఉన్నారు. తండ్రి ఎలాగు లేడు, తల్లి కూడా లేకపోతే ఒంటరిగా ఫీల్ అయి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మ్యారేజ్ చేసుకోలేదు. మరో రెండు మూడేళ్లలో పిల్లలు పెద్ద అవుతారు. కాలేజ్‌కి వెళ్తారు. అప్పుడు నేనుమ్యారేజ్ లైఫ్‌లోకి అడుగుపెట్టి సంతోషంగా ఆ జీవితం గడుపుతాను అని రేణూ పేర్కొంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.