Ramoji Rao : రామోజీరావు నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా?
Ramoji Rao : మీడియా మొఘల్ రామోజీరావు 88 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో కన్నుమూసారు. 1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్.. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో జన్మించారు. భారత వ్యాపారవేత్తగా, మీడియా ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌గా, సినీ నిర్మాతగా , ఫిల్మ్‌సిటీ అధినేతగా.. ఇలా చాలా నిజ జీవిత పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రామోజీరావు అంటే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చేది రామోజీ ఫిలిం సిటీ. కొండల్లో ఆయన అద్భుతమైన ఫిల్మ్ సిటీని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌సిటీగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో చోటు దక్కేలా చేశాడు. ఇక రామోజీరావు సినిమా రంగంలోను తనదైన ముద్ర వేశారు.
ఉషా కిరణ్ మూవీస్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాతో నిర్మాతగా మారారు. దాదాపు 80 పైగా సినిమాలను నిర్మించారు. తెలుగు చిత్రాలతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాళీ సినిమాలు కూడా ఉన్నాయి. వీటిల్లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నుంచి సమాజానికి ఉపయోగపడే సామాజిక సినిమాలు ఉన్నాయి. రామోజీరావు నిర్మించిన చివరి చిత్రం 2015లో వచ్చిన ‘దాగుడుమూతల దండాకోర్’. అయితే రామోజీరావు నిర్మాతలకి తనవంతు తోడ్పాటు అందించారని అనుకుంటుంటారు. కానీ ఆయన ఓ చిత్రంలో నటించారు అన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు.
Ramoji Rao : రామోజీరావు నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా?
సినిమాలంటే ఇష్టపడే రామోజీరావు ఓ మూవీలో అతిథిగా నటించారు. 1978లో యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ‘మార్పు’ చిత్రంలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. నటించింది అతిథి పాత్రలోనే అయినా సినిమా పోస్టర్లపై రామోజీరావు బొమ్మ ప్రచురించడం గమనార్హం. స్వతహాగా కళాభిమాని అయిన రామోజీరావు చిన్నతనంలో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈ క్రమంలోనే యు. విశ్వేశ్వరరావు 1978లో నిర్మించిన ‘మార్పు’ సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. అతిథి పాత్రలో నటించినప్పటికీ, సినిమా పోస్టర్లపై రామోజీరావు ఫోటోను ప్రచురించారు. ఇప్పుడు అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామోజీరావు ఈనాడు న్యూస్‌పేపర్, ఈటీవీ నెట్‌వర్క్ టీవీ ఛానెళ్లు, ఈనాడు జర్నలిజం స్కూల్, సితార, విపుల, చతుర మ్యాగజైన్లు, ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై సినిమా ప్రొడక్షన్, అలాగే.. మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ గ్రూప్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా పచ్చళ్లు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మయూరీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇలా .. అంచెలంచెలుగా భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.