Renu Desai : ఆ ఫోటో చూసి షాక్.. గాల్లో తేలిపోయిన రేణూ దేశాయ్
Renu Desai : రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మామూలుగా అభిమానులు తమ కోపం చేసే పనులు కొన్నిసార్లు సెలెబ్రిటీలకు చిరాకు పుట్టిస్తుంటాయి. ఇంకొన్ని సార్లు ఆనందాన్ని కలగజేస్తుంటాయి. అలా తాజాగా ఓ అభిమాని తనకోసం చేసిన పనిని చూసి రేణూ దేశాయ్ షాక్ అయింది. ఆ అభిమానాన్ని చూసి రేణూ దేశాయ్ ఫిదా అయింది. ఈ మేరకు రేణూదేశాయ్ షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది.
ఈ మధ్య అభిమానులు తమ ప్రేమను చూపించేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒక్కొక్కరు తమలోని ప్రతిభను చూపిస్తూ సెలెబ్రిటీలను ఆకట్టుకుంటున్నారు. తాజాగా రేణూ దేశాయ్ చిత్రపటాన్నిగీసి అందరినీ అబ్బురపరిచేసింది ఓ అభిమాని. ఆమె గీసిన పెయింటింగ్ మొత్తానికి రేణూ దేశాయ్ దగ్గరకు చేరింది. దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న రేణూ దేశాయ్ ఎమోషనల్ అయింది.

renu desai
Renu Desai : ఆ ఫోటో చూసి షాక్.. గాల్లో తేలిపోయిన రేణూ దేశాయ్
అలా అభిమాని గీసిన తన బొమ్మను చూసుకుని మురిసిపోయింది రేణూ దేశాయ్. ఇదో అద్బుతమైన సర్ ప్రైజ్.. అంత అందమైన పెయింటింగ్ వేసినందుకు మధుమితకు థ్యాంక్స్.. ఆయిల్ పెయింటింగ్.. సర్ ప్రైజ్ గిఫ్ట్ అంటూ రేణూ దేశాయ్ గాల్లో తేలిపోయింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేణూ దేశాయ్ ఈ మధ్యే హిందూ ధర్మం అంటూ మాట్లాడిన మాటలు బాగానే హల్చల్ చేశాయన్న సంగతి తెలిసిందే.