Renu Desai : రేణు దేశాయ్ మాటలకు ఎమోషనల్ అయినా పవన్ కళ్యాణ్ కూతురు ..!
Renu Desai : ‘ బద్రి ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ అయిన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పిల్లలు పుట్టడంతో రేణు దేశాయ్ పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. అయితే తాజాగా రేణు దేశాయ్ తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా 20 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ వెండితెరపై కనిపించబోతున్నారు. ఆమె తాజాగా నటించిన చిత్రం ‘ టైగర్ నాగేశ్వరరావు ‘. రవితేజ హీరోగా నటిస్తున్న […]
Renu Desai : ‘ బద్రి ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ అయిన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పిల్లలు పుట్టడంతో రేణు దేశాయ్ పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. అయితే తాజాగా రేణు దేశాయ్ తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా 20 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ వెండితెరపై కనిపించబోతున్నారు. ఆమె తాజాగా నటించిన చిత్రం ‘ టైగర్ నాగేశ్వరరావు ‘. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాదులో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి రేణు దేశాయ్ తో పాటు కూతురు ఆధ్య కూడా వచ్చి అందరిని అలరించింది. చాలా ఏళ్ల తర్వాత ఈవెంట్లో ఆధ్యా కనబడడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఈవెంట్ కి వెళ్ళకముందు రేణు దేశాయ్ తనతో పాటు ఆధ్య కూడా వస్తుంది అని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీంతో చాలా గ్యాప్ తర్వాత ఆధ్యా కనిపించడంతో ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక ఆధ్యా ప్రస్తుతం నైన్త్ క్లాస్ చదువుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక రేణు దేశాయ్ మాట్లాడుతూ తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన వంశీ ,అభిషేక్ అగర్వాల్, రవితేజలకు థాంక్స్ చెప్పారు.
ఈ సినిమాలో రేణు దేశాయ్ హేమలత లవణం అనే పాత్రలో నటిస్తుంది. ఇక రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటారు. బయట అకిరా, ఆద్య ఎక్కువ కనిపించకపోయినా సోషల్ మీడియాలో రేణు దేశాయ్ చేసే పోస్ట ల ద్వారా వాళ్ల గురించి తెలుస్తూ ఉంటుంది. బద్రి సినిమాతో తెలుగు పరిశ్రమ లోకి అడిగిపెట్టిన రేణు దేశాయ్ మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని మనస్పర్ధల కారణం గా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయారు.