Renu Desai : రేణూ దేశాయ్ కోరిక తీర్చిన ఉపాస‌న‌.. ఎంత మంచి మ‌న‌స్సో అంటూ ప్ర‌శంస‌లు

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 28 October 2024, 11:00 am

Renu Desai : రేణూ దేశాయ్ మ‌ల్టీ టాలెంటెడ్‌. ఆమె ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ కాగా, ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ తో క‌లిసి బ‌ద్రి, జానీ సినిమాలు చేసింది ఆ స‌మ‌యంలో అత‌నిని ప్రేమించి పెళ్లాడింది. అయితే కొన్నాళ్ల‌కి విబేధాల వ‌ల‌న వారిద్ద‌రు విడిపోయారు. ప్ర‌స్తుతం త‌న పిల్ల‌ల ఇద్ద‌రి బాగోగులు చూసుకుంటూ సంతోషంగా జీవితం గడుపుతుంది రేణు దేశాయ్. ఈమె సినిమాలకు దూరంగా ఉన్నా కూడా నిత్యం వార్తల్లో ఉంటారు. సమాజంలో జరిగే అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు.. తాజాగా ఈమె సోషల్ మీడియాలో ఓ వీడియోను సోషల్ మీడియా చేశారు. ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో రేణు దేశాయ్ ఒక ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు.

Renu Desai మెగా సాయం..

ఆ వీడియోపై తాజాగా మెగా కోడలు ఉపాసన స్పందించింది. అంతేకాదు ఎవరు ఊహించని సాయం చేసింది. ఆ సాయం ఏంటి? ఉపాసన రేణు దేశాయ్ కు సాయం చేయడం పై మెగా ఫ్యాన్స్ ఎలా స్పందించారో చూద్దాం..నటి రేణూ దేశాయ్‌ మూగ జీవాల సంరక్షణ కోసం రీసెంట్​గా ఎన్జీవో ప్రారంభించారు. ‘శ్రీ ఆద్య యానిమల్‌ షెల్టర్‌’ పేరుతో ఈ సంస్థ అనే పేరును పెట్టారు. దీంతో ఎన్నో ఏళ్ల తన కల నెరవేరిందని పేర్కొంటూ శనివారం సోషల్ మీడియాలోనూ ఆమె పోస్ట్ షేర్ చేశారు. ఇక ఈ సంస్థకు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని ఆమె పేర్కొన్నారు.

Renu Desai : రేణూ దేశాయ్ కోరిక తీర్చిన ఉపాస‌న‌.. ఎంత మంచి మ‌న‌స్సో అంటూ ప్ర‌శంస‌లు

Renu Desai : రేణూ దేశాయ్ కోరిక తీర్చిన ఉపాస‌న‌.. ఎంత మంచి మ‌న‌స్సో అంటూ ప్ర‌శంస‌లు

ఈ నేపథ్యంలో తను ఓ అంబులెన్స్‌ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ అంబులెన్స్​ కొనుగోలు చేయడంలో హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన తన వంతు సాయం చేశారు. చరణ్‌ పెంపుడు శునకం ‘రైమీ’ పేరుతో విరాళం అందించారు. ఈ విషయాన్ని రేణూ దేశాయ్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్​లో షేర్ చేశారు. ‘అంబులెన్స్‌ కొనుగోలుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. దీనికి ఉపాసన కొణిదెల అకౌంట్​ను ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఉపాసన ‘గోల్డెన్ హార్ట్​’ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కాగా, రేణు దేశాయ్ పవన్‌ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పిల్లలు అకీరా నందన్, ఆద్యాలే ప్రపంచంగా బతుకుతున్నారు. అకీరాను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని తెర వెనుక ప్రయత్నాలు జరుగుతుండగా.. రేణూదే తుది నిర్ణయమని ఫిలింనగర్ టాక్.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి