Bigg Boss 8 Telugu : ఇంట్రెస్టింగ్‌గా మారిన ఎలిమినేష‌న్.. క‌మ్యూనిటీ చ‌ర్చనే కొంప ముంచిందా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 8 Telugu : ఇంట్రెస్టింగ్‌గా మారిన ఎలిమినేష‌న్.. క‌మ్యూనిటీ చ‌ర్చనే కొంప ముంచిందా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఎవ‌రు ఎంట్రీ ఇస్తారో, ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనేది అభిమానుల‌లో ఆస‌క్తిని పెంచింది. అయితే ప్ర‌తి శనివారం వ‌చ్చిందంటే నాగార్జున కంటెస్టెంట్స్‌కి క్లాసులు పీకుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. తాజా ఎపిసోడ్‌లో బ్రేకప్ లవ్ స్టోరీలతో పాటు.. ట్రాయాంగిల్ లవ్ స్టోరీలను కూడా బయటపెట్టాడు. విష్ణు ప్రియను ఓ పాయింట్ లో నామినేట్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 October 2024,1:59 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 Telugu : ఇంట్రెస్టింగ్‌గా మారిన ఎలిమినేష‌న్.. క‌మ్యూనిటీ చ‌ర్చనే కొంప ముంచిందా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఎవ‌రు ఎంట్రీ ఇస్తారో, ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనేది అభిమానుల‌లో ఆస‌క్తిని పెంచింది. అయితే ప్ర‌తి శనివారం వ‌చ్చిందంటే నాగార్జున కంటెస్టెంట్స్‌కి క్లాసులు పీకుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. తాజా ఎపిసోడ్‌లో బ్రేకప్ లవ్ స్టోరీలతో పాటు.. ట్రాయాంగిల్ లవ్ స్టోరీలను కూడా బయటపెట్టాడు. విష్ణు ప్రియను ఓ పాయింట్ లో నామినేట్ చేసిన యష్మిని.. మరి నువ్వు చేస్తుంది ఏంటీ అని డైరెక్ట్ గా క్వశ్చన్ వేశాడు నాగ్. ఇక నిఖిల్, పృధ్వీల ఆటను అద్భుతం అన్న నాగార్జున…ఆటను అద్భుతం అంటూనే వారు చేసిన తప్పులను ఎత్తి చూపించాడు కింగ్. అంతే కాదు గంగవ్వ చేసిన ఫ్రాంక్ వీడియోను కూడా ప్రత్యేకంగా అభినందించాడు నాగార్జున.

Bigg Boss 8 Telugu ఎలిమినేష‌న్ స‌స్పెన్స్..

ఇక బిగ్ బాస్ సీజ‌న్ 8 నామినేషన్స్‌లో మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని ఉన్నారు. వీరిలో నామినేషన్స్ పూర్తయినప్పటి నుంచి బిగ్ బాస్ ఓటింగ్‌లో ప్రేరణ టాప్‌లో ఉంటూ కొనసాగింది. అత్యధిక ఓట్లతో ప్రేరణ నెంబర్ వన్ స్థానంలో ఉంటే నిఖిల్ రెండో స్థానం, విష్ణుప్రియ మూడో ప్లేసులో నిలిచింది.ఇక నాలుగో స్థానంలో పృథ్వీ ఉంటే.. ఐదు, ఆరు స్థానాల్లో మెహబూబ్, నయని ఉన్నారు. డేంజర్ జోన్‌లో ఉన్న మెహబూబ్, నయని స్థానాలు మారుతూ వచ్చాయి. ఈ వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని కొన్ని వర్గాలు అంటే.. మరికొంతమంది నయని పావని ఎలిమినేట్ అయిందని టాక్ నడిచింది.

Bigg Boss 8 Telugu ఇంట్రెస్టింగ్‌గా మారిన ఎలిమినేష‌న్ క‌మ్యూనిటీ చ‌ర్చనే కొంప ముంచిందా

Bigg Boss 8 Telugu : ఇంట్రెస్టింగ్‌గా మారిన ఎలిమినేష‌న్.. క‌మ్యూనిటీ చ‌ర్చనే కొంప ముంచిందా..!

అక్టోబర్ 6న వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ హౌజ్‌లోకి వచ్చిన రెండు రోజులకు నబీల్‌తో కమ్యూనిటీపై చర్చ పెట్టాడు. తమ కమ్యూనిటీ వాళ్లంతా వారిద్దరికే ఓట్లు వేస్తారు అని, ఇద్దరిలో ఏ ఒక్కరు నామినేషన్స్‌లో ఉన్న ఓట్లు గుద్దుతారని, ఇద్దరు నామినేట్ కాకుండా చూసుకోవాలని మెహబూబ్ చెప్పాడు. మెహబూబ్, నబీల్ మాట్లాడిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దాంతో మెహబూబ్‌పై తీవ్రమైన నెగెటివిటీ ఎర్పడింది. అందుకే ఆ తర్వాతి వారమే నామినేషన్స్‌లోకి వచ్చిన మెహబూబ్‌కు ఓట్లు పడలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అక్టోబర్ 6న బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన మెహబూబ్ ఈ వారం ఎలిమినేట్ అయ్యాడ‌ని టాక్ న‌డుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది