Bigg Boss 6 Telugu : షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ .. టైటిల్ విన్నర్ రేవంత్ కాదట ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :18 December 2022,5:20 pm

Bigg Boss 6 Telugu : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే కి చేరుకుంది. ఎంతోమంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎలిమినేషన్ తర్వాత ఇప్పుడు హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ గా శ్రీహన్, రేవంత్, కీర్తి, ఆదిరెడ్డి మరియు రోహిత్ లు ఉన్నారు. ఈ ఐదు మందిలో ఎవరు టైటిల్ గెలుచుకొని 50 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ తో పాటు పాతిక లక్షల విలువ చేసే ఫ్లాట్, కార్ గెలుచుకోబోతున్నారో తెలియాలంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ వీక్ లో జరిగిన ఓటింగ్ ప్రకారం అందరికంటే ఎక్కువ ఓట్లతో రేవంత్ ముందున్నాడు. కానీ అంత ఈజీగా సాగిపోతే అది బిగ్ బాస్ షో ఎందుకు అవుతుంది.

ముందు ఎపిసోడ్స్ లో ఎలిమినేషన్స్ ఎంత అన్యాయంగా జరిగాయే అంత ఈజీగా ఎవరు మర్చిపోరు. ఆ ఎలిమినేషన్స్ ఈ సీజన్ మీదనే విరక్తి వచ్చేలా చేసాయి . ఇప్పుడు టైటిల్ విన్నర్ లో కూడా అలాగే జరగబోతుందని ఓ సమాచారం బయటకి వచ్చింది. అది ఈరోజు మూడు గంటల సమయంలో తెలియబోతుందట. టైటిల్ విన్నర్ గా రేవంత్ ముందుండగా, శ్రీహాన్ రన్నర్ గా గెలిచారని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి. కానీ ఇక్కడే అభిమానులకి బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని అంటున్నారు.

Revanth is not Bigg Boss 6 Telugu title winner

Revanth is not Bigg Boss 6 Telugu title winner

టాప్ 5 ప్లేస్ లో రోహిత్ ఎలిమినేట్ అవ్వగా ఆదిరెడ్డి టాప్ 4 కంటెస్టెంట్ గా బయటకి వచ్చేస్తారు. వాళ్లిద్దరు ఎలిమినేట్ అయ్యాక రేవంత్, శ్రీహాన్, కీర్తి టాప్ 3 కంటెస్టెంట్స్ గా నిలిచారు. వీరిలో రేవంత్ కాకపోతే శ్రీహాన్ కి టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ కాకుండా కీర్తి కూడా టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది. బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అన్నారు కాబట్టి రేవంత్ టైటిల్ రేస్ నుండి తప్పుకున్నట్లే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ న్యూస్ నిజమో కాదో తెలియాలంటే రాత్రి బిగ్ బాస్ వచ్చేంత వరకు వేచి చూడాలి.

Advertisement

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి