RGV : రేపు మీకు ఇదే దుస్తితి వ‌స్తుందంటూ చిరు, మ‌హేష్‌,ప‌వ‌న్‌ల‌పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RGV : రేపు మీకు ఇదే దుస్తితి వ‌స్తుందంటూ చిరు, మ‌హేష్‌,ప‌వ‌న్‌ల‌పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :12 September 2022,7:00 pm

RGV : కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన రామ్ గోపాల్ వ‌ర్మ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్త‌ల‌లో నిలుస్తుంటారు. సినిమా సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ హాట్ టాపిక్ అవుతుంటారు. అయితే తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం నేపథ్యంలో ఆర్జీవీ చేసిన వరుస ట్వీట్లు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. తన ట్వీట్లలో టాలీవుడ్ నటులైన చిరంజీవి, మోహన్ బాబు. బాలయ్య, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లను ప్రస్తావించడంలో తీవ్ర దుమారం రేగింది. ఆ ట్వీట్స్ కు కొందరు సపోర్ట్ గా నిలుస్తూంటే మరికొందరు వోడ్కా ట్వీట్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇంతకీ వర్మ ఏమి ట్వీట్ చేసారంటే…

భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి , మోహనబాబుగారికి, బాలయ్యకి , ప్రభాస్ కి,మహేష్,కల్యాణ్కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.

RGV comments on tollywood

RGV comments on tollywood

RGV : షాకింగ్ ట్వీట్స్..

నేను కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, చిరంజీవి, బాలయ్యకి , ప్రభాస్ కి ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అంటూ రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ వివాదానికి దారి తీసింది. . ‘‘మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం.. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది’’ అంటూ ఆర్జీవీ మొన్నామధ్యన జరిగిన సినీ కార్మికుల సమ్మె గురించి ప్రస్తావించారు. మొత్తానికి ఆర్జీవి చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి..

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది