Shivaji Maharaj : కాంతార సినిమాతో చరిత్ర సృష్టించిన కన్నడ హీరో రిషబ్ శెట్టి. కాంతార సినిమాతో కన్నడ, తెలుగుతోపాటు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు . కాంతార సినిమా తర్వాత రిషబ్ పేరు మారుమ్రొగిపోతుంది. అయితే రిషబ్ ఇప్పటికే ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రేజీ బయోపిక్‌తో అందరినీ సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. రిషబ్ శెట్టి నటిస్తోన్న బయోపిక్ శివాజీ మహారాజ్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.’ఛత్రపతి శివాజీ మహారాజ్’… ఒక పోరాట యోధుడు, స్వాతంత్ర సమర వీరుడు, ప్రతి భారతీయుడు ఛాతి పైకెత్తి మావాడు అని చెప్పుకొనే మహారాజు. ఆయన జీవితంపై పలువురు దర్శక రచయితలు, హీరోలు సినిమాలు తీశారు. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో శివాజీని వెండితెరపై ఆవిష్కరించారు.
ప్రస్తుతం శివాజీ గెటప్‌లో రిషబ్ లుక్ వైరల్ అవుతుంది. ‘ఛత్రపతి శివాజీ జీవితానికి సంబంధించి ఎన్నో విశేషాలతో సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ 2027 జనవరి 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిపై రిషబ్ మాట్లాడుతూ.. ‘ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో నటిస్తున్నందుకు గౌరవంగా, గర్వంగా ఉంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన శక్తిమంతమైన వ్యక్తి చరిత్ర. ఇలాంటి యోధుడి చరిత్రను సినిమాగా తీసుకురావాలనేది గొప్ప ఆలోచన. ఈ యాక్షన్ డ్రామా కోసం సిద్థంగా ఉండండి. అద్భుతమైన సినిమాటిక్ అనుభవం కోసమే కాదు.. శివాజీ గురించి ఇప్పటివరకు తెలియని కథలను కూడా తెలుసుకోవడానికి రెడీగా ఉండండి’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.
అపారమైన అసమానతలను అధిగమించి.. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించి శాశ్వతమైన వారసత్వాన్ని సృష్టించిన యోధుడికి నివాళిగా వస్తోందని మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.’కాంతార’ విజయం తర్వాత రిషబ్ ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా, ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునేలా, కథ కథనాలు ఉండేలా చూసుకుంటున్నారు. ‘జై హనుమాన్’ కంటే ముందు ‘కాంతార: ఛాప్టర్ 1’ రానుంది. rishab shetty shivaji maharaj first look goes viral ,
Pushpa 2 The Rule Live Updates : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun సుకుమార్ కాంబోలో…
నటీనటులు : అల్లు అర్జున్, రష్మిక మందన్న, శ్రీలీల, సునీల్, అనసూయ, రావు రమేష్ సంగీతం : దేవి శ్రీ…
Pushpa 2 The Rule Movie Review : అల్లు అర్జున్ Allu Arjun సుకుమార్ కాంబినేషన్ లో భారీ…
Ganga Water : హరిద్వార్‌లోని గంగా నది నీరు 'బి' కేటగిరీలో ఉన్నట్లు గుర్తించబడిందని, ఇది త్రాగడానికి సురక్షితం కాదని,…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi ఆరు పదుల వయస్సులో కూడా చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. చిరంజీవిని ఇప్పుడు…
Pushpa 2 The Rule : చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్ Allu Arjun ఆనతి కాలంలోనే…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం సీజన్ 8…
Pushpa 2 The Rule Business : పుష్ప2.. పుష్ప2.. పుష్ప2.. ప్రస్తుతం ఇండియా మొత్తం ఈ నామమే జపం…
This website uses cookies.