Ritika Singh : ఊర మాస్ డాన్స్ తో రచ్చ రచ్చ చేసిన రితికా సింగ్.. రఫ్ఫాడించేసిందిగా?
Ritika Singh : రితికా సింగ్ అంటే టక్కున గుర్తుపట్టకపోవచ్చు కానీ.. గురు సినిమా హీరోయిన్ అంటే మాత్రం గుర్తుకురావచ్చు. గురు సినిమాలో తను చేసిన నటనను అందరూ గుర్తుకు పెట్టుకున్నారు. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి రితికా సింగ్ పరిచయం అయింది గురు సినిమాతోనే. అప్పటికే తను తమిళంలో హీరోయిన్. గురు సినిమాలో తను బాగానే యాక్ట్ చేసినా.. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత తనకు ఎందుకో తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు రాలేదు.
లారెన్స్ తో హారర్ సినిమాలోనూ రితికా సింగ్ నటించింది. అయినా తనకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దీంతో తను అందాల ఆరబోతను పెంచింది. తెలుగులోనూ మరికొన్ని సినిమాల్లో నటించినా అంత గుర్తింపు మాత్రం రావడం లేదు. తమిళంలో రితికా సింగ్ నటించిన ఓమై కడవులే అనే సినిమా మాత్రం మంచి విజయం సాధించింది. ఆ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ కూడా చేస్తున్నారు. అయితే.. రితికా సింగ్ కు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది.

Ritika Singh latest dance video viral
Ritika Singh : సోషల్ మీడియాలో రితికకు సూపర్ క్రేజ్
సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని తను ఫోటోషూట్స్, వీడియోలతో రెచ్చిపోతుంది. దీంతో తనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పటి వరకు తను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోషూట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల ఓ డాన్స్ వీడియోను రితిక విడుదల చేసింది. మునుపెన్నడూ చూడని విధంగా గ్లామర్ ను ఒలకబోసింది ఈ వీడియోలో. తన డ్యాన్స్ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పొట్టి డ్రెస్ వేసుకొని రితిక చేసిన డ్యాన్స్ చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. వామ్మో.. రితికలో ఇంత టాలెంట్ ఉందా అంటూ అవాక్కవుతున్నారు.