Home » Entertainment » Ritu Chowdhary And Vishnu Priya Enjoys
Entertainment

Vishnu Priya : గోవాలో బ్యూటీల సందడి.. రీతూతో విష్ణు ప్రియ సందడి

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: September 6, 2022, 1:30 pm
Advertisement

Vishnu Priya : విష్ణు ప్రియ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. యూట్యూబ్‌లో ఆమె నటించిన ప్రైవేట్ ఆల్బమ్ ట్రెండ్ అవుతోంది. గత రెండు మూడు రోజులుగా నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. మానస్, విష్ణుప్రియ కలిసి ఈ పాటలో మాస్ స్టెప్పులు వేశారు. జరీ జరీ పంచె కట్టి అంటూ మానస్, విష్ణుప్రియ ఊపు ఊపేశారు. ఈ ఫోక్ సాంగ్‌కు విష్ణుప్రియ వేసిన స్టెప్పులు, ఎద అందాలను ఊపిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. మొత్తానికి విష్ణుప్రియ చేసిన ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ గోవాకు చెక్కేసింది. జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరితో కలిసి విష్ణుప్రియ గోవాల ప్రత్యక్షమైంది. ఈ ఇద్దరికీ కామన్ పాయింట్ జబర్దస్త్ అన్న సంగతి తెలిసిందే.

Advertisement

ఆ మధ్య జబర్దస్త్ షోలో రీతూ ఎంత హంగామా చేసిందో అందరికీ తెలిసిందే. రీతూ కూడా ఓ ట్రాక్ నడిపించింది. కొన్ని స్కిట్లలో హంగామా చేసింది. జాఫర్‌తో కలిసి రీతూ చేసిన స్కిట్లు ఆ మధ్య కాస్త వైరల్ అయ్యాయి. టీం లీడర్‌గా అతనికి ఇచ్చిన అవకాశాన్ని అంతగా ఉపయోగించుకోలేకపోయాడు. ఇక రీతూ మీద ఆది వేసే పంచులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. రీతూ చౌదరి.. యూట్యూబ్‌లో యాంకర్‌గానూ బాగానే ఫేమస్. సోషల్ మీడియా, బుల్లితెరపై రీతూకు మంచి ఫాలోయింగే ఉంది. ఇక ఈమె ఎక్కువగా జబర్దస్త్ ఆర్టిస్టులతోనే స్నేహం చేస్తుంటుంది.

Ritu Chowdhary and vishnu priya enjoys

Advertisement

అలా విష్ణుప్రియకు ఈమె బాగానే కనెక్ట్ అయినట్టుంది. మామూలుగా అయితే శ్రీముఖి విష్ణుప్రియ కలిసి ఉంటారు. వెకేషన్లకు వెళ్తుంటారు. కానీ ఈ మధ్య ఈ ఇద్దరూ కలిసి కనిపించడంలేదు. ఇద్దరికీ ఏవో గొడవలు జరిగినట్టున్నాయి. అవన్నీ పక్కన పెడితే.. ఇప్పుడు మాత్రం విష్ణుప్రియ గోవాలో సందడి చేస్తోంది. రీతూ చౌదరి ఈ మేరకు పోస్ట్ చేసింది. తాను గోవాలో ఉన్నట్టుగా.. తనతో పాటుగా విష్ణుప్రియ కూడా ఉందని చూపించింది. మొత్తానికి ఈ ఇద్దరూ అలా గోవా బీచుల్లో, పబ్బుల్లో హంగామా చేసేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ వెకేషన్ ఎన్ని రోజులు అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. విష్ణుప్రియ నటించిన వాంటెండ్ పండుగాడ్ దారుణంగా బెడిసి కొట్టేసింది.

Ritu Chowdhary and vishnu priya enjoys

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి